Site icon PRASHNA AYUDHAM

ట్రాన్స్ ఫార్మర్లలో కాపర్ వైర్ దొంగలిస్తున్నఅంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్..!!

IMG 20250712 WA0553

ట్రాన్స్ ఫార్మర్లలో కాపర్ వైర్ దొంగలిస్తున్నఅంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్..!!

సిద్దిపేట,వ్యవసాయ పొలాల వద్ద గల ట్రాన్స్ ఫార్మర్లలో కాపర్ వైర్ దొంగలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను కుకునూరు పల్లి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.

పోలీసు కమిషనర్ డా అనురాధ తెలిపిన వివరాల ప్రకారం… రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన మహ్మద్ అజారుద్దీన్, మహ్మద్ షకీర్, తెలీమ్ ఖన్, సలీమ్ ( సోహెల్), అక్రమ్ లు జేసీబీ డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. జల్సాలకు అలవాటు పడిన వారు పని చేసే సమయంలో వ్యవసాయ బావుల వద్ద గల ట్రాన్స్ ఫార్మర్లను గుర్తించి రాత్రి సమయంలో ట్రాన్స్ ఫార్మర్ ను పగలగొట్టి అందులోని కాపర్ వైర్ దొంగలించే వారు. 2025, మే 27న కొండపాక మండల కేంద్రంలోని కరెంట్ ట్రాన్స్ ఫార్మర్ ను పగలగొట్టి అందులోని కాపర్ వైర్ దొంగలించారని విద్యుత్ శాఖ ఏఈ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అధునాతన టెక్నాలజీ ఉపయోగించి అజారుద్దీన్, మహ్మద్ షకీర్ లను అరెస్టు చేశారు.

వారి వద్ద 272 కేజీల కాపర్ వైర్, రూ.3, 24, 700 నగదు ,మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు తెలిపారు. మహ్మద్ అజారుద్దీన్ నాలుగు సంవత్సరాల క్రితం ట్రాన్స్ ఫార్మర్ పగలగొట్టి కాపర్ వైర్ దొంగలించిన కేసులో శామీర్ పేట పోలీసులు అరెస్టు చేశారు. సిద్దిపేట జిల్లాలో 26, మెదక్ జిల్లాలో 34, కరీంనగర్ జిల్లాలో 19, వరంగల్ జిల్లాలో 63, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 40, సైబరాబాద్ పరిధిలో 2, పెద్దపల్లి జిల్లాలో 1 ట్రాన్స్ ఫార్మర్ పగల గొట్టి కాపర్ వైర్ దొంగలించినట్లు తెలిపారు. అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన తొగుట సీఐ లతీఫ్, కుకునూరుపల్లి ఎస్సై శ్రీనివాస్, బేగంపేట ఎస్ఐ మైపాల్ రెడ్డి, హెడ్ కానిస్టేబుళ్లు మధుసూదన్ రెడ్డి, రమణ, కానిస్టేబుళ్లు రమేష్, శ్రీకాంత్, భాస్కర్ రెడ్డి, నరేష్, తిరుపతి, సతీష్, మజీద్, రత్నాకర్, చంద్రం, స్వప్న, వనిత, ఐటీ కోర్ సిబ్బంది శ్రీకాంత్, రమేశ్ లను సీపీ అభినందించారు. త్వరలో నగదు రివార్డు అందజేయడం జరుగుతుందన్నారు.

Exit mobile version