Headline:
దొంగతనాన్ని చాకచక్యంగా చేదించిన జమ్మికుంట పోలీసులు
*దొంగలించిన కాపర్ వైర్ స్వాధీనపరచుకొని ఇద్దరు దొంగలు అరెస్ట్*
*48 గంటల్లో కేసులు చేదించిన సీఐ రవిని ఎస్సై ఆరోగ్యం పోలీస్ సిబ్బంది అభినందించిన ఏ సి పి శ్రీనివాస్ జీ*
*జమ్మికుంట నవంబర్1 ప్రశ్న ఆయుధం::-*
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని దుర్గా కాలనీలో ఉన్న రైల్వే శాఖకు చెందిన జయంత్ ఇన్ఫ్రా అని ఒక ప్రైవేటు కాంట్రాక్టర్ గోదాం లో నిల్వ ఉంచిన సుమారు నాలుగున్నర లక్షల విలువ చేసే కాపర్ వైర్ ను నవంబర్ 29వ తేదీన గోదాం సెట్టర్ తాళాలు పగల కొట్టి దానిలోని కాపర్ వైరు సుమారు 500 కేజీల వైరును దొంగలించినట్లు గోడౌన్ ఇంచార్జి జగదీష్ దాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరిపి సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్న క్రమంలో 30వ తారీకు రాత్రి పోలీస్ సిబ్బంది పెట్రోలు నిర్వహిస్తుండగా అనుమానం వచ్చిన వ్యక్తులను పరిశీలించగా ఆటోలో తరలిస్తున్న కాపర్ వైర్ ను వ్యక్తులను సీఐ వరగంటి రవి ఏర్పాటుచేసిన ప్రత్యేక బృందం ఎస్సై ఆరోగ్యం ఐడి పార్టీ పోలీస్ సిబ్బంది 48 గంటలు గడవక ముందే ఎంతో చాకచక్యంగా పట్టుకోవడం జరిగిందని సీఐ తెలిపారు పట్టుకున్న వ్యక్తులను జమ్మికుంట పోలీస్ స్టేషన్కు తరలించి మీడియా ముందు ప్రవేశపెట్టారు పట్టుకున్న వ్యక్తుల్లో బానోత్ సందీప్ అనే వ్యక్తి పట్టుబడగా మరో వ్యక్తి బాలు పరారీలో ఉన్నట్లు తెలిపారు బానోతు సందీప్ తో విచారించగా బాలు, మహిళలతో కలిసి నవంబర్ 29న సుమారు 5 లక్షల విలువచేసే కాపరువైరును దొంగతనం చేసి కీసర గుండ్లగూడ లోని నాగారం గ్రామానికి చెందిన హేమ కనకయ్య అనే వ్యక్తికి విక్రయించినట్లు తెలిపాడు దొంగతనానికి పాల్పడ్డ సందీప్ ను సహకారంతో కొనుగోలు చేసిన హేమ కనకయ్యను అరెస్టు చేయడం జరిగిందని పరారీలో ఉన్న బాలును మహిళలను త్వరలో అరెస్టు చేసి పూర్తి సమాచారం రాబడతామని సీఐ రవి తెలిపారు దొంగతనానికి పాల్పడిన వ్యక్తులను చాకచక్యంగా పట్టుకొని కేసును చేదించిన జమ్మికుంట పట్టణ సీఐ రవి ని ఎస్ఐ ఆరోగ్యంను హెడ్ కానిస్టేబుల్ మోహన్ సదయ్య సంపత్ లతోపాటు కానిస్టేబుల్ వేణు మిగతా సిబ్బందిని ఏసిపి శ్రీనివాస్ జి అభినందించారు.