Site icon PRASHNA AYUDHAM

కార్పొరేషన్ ఇష్టారాజ్యం..

కార్పొరేషన్ ఇష్టారాజ్యం.

గోప్యంగా మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం..

గత కౌన్సిల్ సమావేశాల్లో కూడా మీడియాకు అనుమతి లేదు..* 

ఎలాంటి కార్యక్రమం చేపట్టిన సమాచారం ఇవ్వం…

అంతా మా ఇష్టం..

 

 

 

 

నిజాంబా ద్ మున్సిపల్ కార్పొరేషన్ లో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరి స్తున్నారు. మీడియాకు సమాచారం లేకుండా గోప్యంగా మున్సిపల్ కౌన్సిలింగ్ సమావేశం నిర్వహించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. శనివారం నిజామాబాద్ నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో నగర మేయర్, కార్పొ రేషన్ కమిషనర్, డిప్యూటీ మేయర్, అర్బన్ ఎమ్మెల్యే , కార్పొరేటర్లతో కౌన్సిలింగ్ సమావేశం నిర్వహించారు. కౌన్సిలింగ్ సమావేశానికి సంబంధించిన సమాచారాన్ని మీడియాకు ఇవ్వకుండానే సమావేశం నిర్వహించ డంలో ఆంతర్యం ఏమిటి. గతంలో నిర్వహించిన కౌన్సిల్ సమావేశానికి లోనికి అనుమతి ఇవ్వ లేదు. కానీ ఈ సారి సమావేశానికి లోనికి అనుమతి సంగతి పక్కన పెడితే… సమా వేశం నిర్వహి స్తున్నట్లు కనీసం మీడియాకు సమాచారం ఇవ్వలేదు.

అసలు కార్పొరేషన్ లో ఏం జరుగుతుంది?

నగర అభివృద్ధిపై కమిషనర్, మేయర్ ,ఎమ్మెల్యే కార్పొరేటర్ లతో నిర్వహిస్తున్న కౌన్సిలింగ్ సమావేశం గోప్యంగా ఎందుకు నిర్వ హిస్తు న్నారు.అసలు మున్సిపల్ కార్పొ రేషన్ లో ఏం జరుగుతుంది. కౌన్సిల్ సమావేశం కొనసాగుతుండగానే ఒక కార్పొరేటర్ సమావేశాన్ని బైకాట్ చేసి వెళ్లినట్టు సమాచారం. అంతేకాకుండా సమావేశానికి కొందరు మైనార్టీ కార్పొరేటర్లు గైరాజరయ్యారు.

 

*కార్పొరేషన్ ఇష్టారాజ్యం..*

 

నిజామాబాద్ నగర మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తు న్నారు. గతంలో కౌన్సిలింగ్ సమావేశానికి ఒకరోజు ముందు మీడియాకు సమాచారం ఇస్తారు. ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పని చేస్తున్న మీడియాకు ఎలాంటి సమా చారం ఇవ్వకుండానే గోప్యంగా కౌన్సిలింగ్ సమావేశం నిర్వహిస్తున్నారు. అంతే కాకుండా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, అధికారులు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టిన మీడియాకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి

Exit mobile version