కౌన్సిల్ లో ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా, కార్పొరేటర్ బన్నాల
మేడ్చల్ జనవరి 30
గ్రేటర్ కౌన్సిల్ సమావేశంలో పాలన చేతగాని ప్రభుత్వం ను ప్రశ్నించిన తమను దౌర్జన్యంగా అరెస్ట్ చేశారని టిఆర్ఎస్ పార్టీ చిల్కానగర్ కార్పోరేటర్ జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మెంబర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ ఆరోపించారు. జీహెచ్ఎంసీ సమావేశంలో తమ గొంతు నొక్కారని ఆరోపించారు. కౌన్సిల్ సమావేశం నుంచి తమను బలవంతంగా రాంగోపాల్ పేట్ పోలీస్ స్టేషన్ కు తీసుకురావడం దారుణమన్నారు.