*ఆల్విన్ కాలనీ డివిజన్ లో సుడిగాలి పర్యటన చేసిన కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్*
ప్రశ్న ఆయుధం జులై19 : కూకట్‌పల్లి ప్రతినిధి
నిన్న కురిసిన భారీ వర్షానికి 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలో పలుచోట్ల వరదనీరు రోడ్డు మీద ప్రవహించడంతో వాహనదారులకు ఇబ్బంది అవుతుందన్న విషయం తెలుసుకున్న డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ శుక్రవారం రోజున అలానే శనివారం రోజున పలు కాలనీలలో పర్యటించి జి.ఎచ్.ఎం.సి సిబ్బందితో వరదనీటిని క్లియర్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ నిన్న కురిసిన భారీ వర్షానికి డ్రైనేజీ మ్యాన్ హోల్స్ నుండి రోడ్లపై ప్రవహిస్తున్న వరదనీరుని వెంటనే సిబ్బందితో తొలగించడం జరిగిందని అన్నారు. ప్రదానరహదారి కావడంతో వాహనదారులకు ఇబ్బంది కలగకుండా, ట్రాఫిక్ నిలిచిపోకుండా వరదనీటిని క్లియర్ చేయడం జరిగిందని అన్నారు. అకాల వర్షాలతోఎటువంటి ఇబ్బందులు కలిగిన,(ఎలక్ట్రికల్, రోడ్డు, డ్రైనేజీ, మంచి నీటి) వంటి సమస్య లు ఎదురైన, వెంటనే సంబంధిత అధికారులకు గాని, మాకు గాని, మా కార్యాలయంకు గాని సంప్రదించాలని తెలియచేసారు. అదేవిధంగా వర్షాలను దృష్టిలో పెట్టుకొని లోతట్టు ప్రాంతాల పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని , జీహెచ్ఎంసీ అధికారులు మరియు మాన్ సున్ ఎమర్జెన్సీ టీమ్స్ , డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎటువంటి ఇబ్బంది లేకుండ చూడలని తెలియచేసారు. కార్యక్రమంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, సమ్మారెడ్డి, జనార్దన్, గోపాల్, కైసర్, సుధాకర, మోజెస్, జి.ఎచ్.ఎం.సి సిబ్బంది, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.