ఆల్విన్ కాలనీ ఫేస్ 1 లో పాదయాత్ర చేసిన కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్
ప్రశ్న ఆయుధం ఏప్రిల్ 04: శేరిలింగంపల్లి ప్రతినిధి

ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ ఫేస్ 1 లో డ్రైనేజ్ మరియు రోడ్లకు సంబంధించి సమస్యలు ఉన్నాయని కాలనీ వాసులు డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకురాగా కార్పొరేటర్ ఆల్విన్ కాలనీ ఫేస్ 1 లో ఎ.ఇ శ్రావణి, వాటర్ వర్క్స్ మేనేజర్ ఝాన్సీ మరియు కాలనీ వాసులతో కలిసి పాదయాత్ర చేసి సమస్యలను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ కాలనీలో కొంతమేర డ్రైనేజీ లైన్ మరియు సీసీ రోడ్ల పనులు పూర్తిచేయవలసి ఉంది కాబట్టి సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరలో పనులు పూర్తిచేస్తామని కాలనీ వారికి హామీ ఇచ్చారు. అలాగే వీధి దీపాలు వెలగక రాత్రి సమయంలో సమస్యగా ఉందని కాలనీ వాసులు తెలియచేయడంతో కార్పొరేటర్ విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి వెంటనే సమస్యను పరిష్కరించాలని ఆదేశించడం జరిగింది. కార్యక్రమంలో బి.వెంకటేష్ గౌడ్, కుమారచారి, రఘు, లక్ష్మీ, హేమలత, పోశెట్టిగౌడ్, శంకర్, జైహింద్ రెడ్డి, ఐజాక్, రాములు, సునీల్ గౌడ్, ఖదీర్, కృష్ణయ్య, నాగేశ్వరరావు, శాస్త్రి, లలన్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 0