జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి
ప్రశ్న ఆయుధం అక్టోబర్ 17 రంగారెడ్డి జిల్లా హయత్ మండలం: జూబ్లీహిల్స్ అభివృద్ధి కొరకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి శ్రీ లంకల దీపక్ రెడ్డి ని గెలిపించాలని లక్ష్యంతో హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి ఎల్బీనగర్ నియోజకవర్గం బిజెపి కార్పొరేటర్లతో కలిసి జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది, ఈ సందర్భంగా వారు ఎన్నికల ప్రచార కార్యాచరణ స్థానిక నాయకులకు కార్యకర్తలకు వివరించడం జరిగింది, కాంగ్రెస్- బీ ఆర్ఎస్ జూబ్లీహిల్స్ ప్రజలకు చేసిందేమీ లేదని, కేవలం రాజకీయాల లబ్ధి కోసమే ఎంఐఎం లాంటి పార్టీలతో కలిసి చేస్తున్న కుటీల రాజకీయాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించాలని వారు తెలిపారు.