ఇగ్నైట్ విద్యాసంస్థల చలివేంద్రాన్ని ప్రారంభిన్చినకార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు  

ఇగ్నైట్ విద్యాసంస్థల చలివేంద్రాన్ని ప్రారంభిన్చిన

కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు

IMG 20250304 WA0010 scaled

ఆయుధం : కూకట్‌పల్లి ప్రతినిధి

కెపిహెచ్బి డివిజన్ కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు సాయి నగర్ లోని జేఎన్టీయూ మెట్రో స్టేషన్ కు అత్యంత సమీపంలో ఇగ్నైట్ (IGNITE) విద్యాసంస్థల వారు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి తాపం పెరుగుతుండడంతో ప్రజలకు ఎంతో ఉపయోగపడే చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. మార్చి నెల ప్రారంభం నుంచి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ పర్యాంతం సాయి నగర్ వాసులకు, బాటసారిలకు, మరియు పరీక్షా కేంద్రాలకు వచ్చే విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు వేసవి తాపం నుంచి ఉపశమనం కల్పించే సదుద్దేశంతో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఇగ్నైట్ విద్యాసంస్థల చైర్మన్ కొర్లకుంట రమేష్ ని అభినందించారు. ఈ కార్యక్రమంలో సాయి నగర్ వాసుల వైఎస్ ప్రసాద్, అచ్యుతరామయ్య, దుర్గాప్రసాద్ రెడ్డి, ఉమామహేశ్వరరావు, తులసి, విష్ణు, ప్రసాద్, బాలకృష్ణ మరియు కాలనీవాసులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now