Site icon PRASHNA AYUDHAM

ట్రంక్ సేవరజ్ పైప్ లైన్ పనులను పరివేక్షించిన  కార్పొరేటర్ మందడి శ్రీనివాస రావు 

ట్రంక్ సేవరజ్ పైప్ లైన్ పనులను పరివేక్షించిన

కార్పొరేటర్ మందడి శ్రీనివాస రావు

ప్రశ్న ఆయుధం నవంబర్ 27: కూకట్‌పల్లి ప్రతినిధి 

కే పి హెచ్ బి డివిజన్ కార్పొరేటర్ మందడి శ్రీనివాస రావు డివిజన్లోని 7వ ఫేస్ వద్ద ఎస్టిపి ప్లాంట్ కి అనుసంధానంగా నిర్మితమవుతున్న ట్రంక్ సేవరజ్ పైప్ లైన్ పనులను పరివేక్షించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో డివిజన్లోని అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపన నిర్వహించామని.. అందులో భాగంగానే ఇప్పటికే అనేక రోడ్లు పార్కులు, స్మశానవాటికలు మరియు నూతన పైప్ లైన్ నిర్మాణాలు పూర్తి చేసుకున్నమని.. ఇంకా పెండింగ్లో ఉన్న పనులు కూడా త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిఎం ప్రభాకర్ రావు, డీజిఎం సంశీర్, టీఎస్ ట్రాన్స్కో శ్రీనివాస్, డి. ఈ .శ్రీదేవి ,ఏఈ సాయి ప్రసాద్, హెచ్ ఎం డబ్ల్యు ఎస్ మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version