హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నందమూరి నగర్లో మంచినీటి సమస్యను పరిష్కరించిన  కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నందమూరి నగర్లో మంచినీటి సమస్యను

పరిష్కరించిన

కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు

ప్రశ్న ఆయుధం ఫిబ్రవరి 07: కూకట్‌పల్లి ప్రతినిధి

IMG 20250207 WA0146

నగర్ డివిజన్ పరిధిలోని నందమూరి నగర్ కాలనీ లో మంచినీటి సమస్యను పరిశీలించి వాల్వ్ రిపేర్ వున్నదని తెలుసుకొని తక్షణమే సమస్యను పరిష్కరించాలని చెప్పిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, నందమూరి నగర్ కాలనీ లో ఆఖరున ఉన్న ఆరు ఇళ్లకు ఒక నెల రోజుల నుండి మంచి నీరు రావడంలేదని మా ఆఫీసు కి వచ్చి నన్ను కలిసినందున,తక్షణమే స్పందించి ఇన్చార్జి మేనేజర్ ను తీసుకెళ్ళి వాల్వ్ రిపేర్ వున్నదని తెలుసుకొని తక్షణమే సమస్యను పరిష్కరించాలని చెప్పిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు . అలానే ప్రజా సమస్యలే పరిష్కార ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని, సంతులిత, సమగ్ర అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్నామని కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు పేర్కొన్నారు. అదేవిధంగా కాలనీ వాసులు అందరూ కలిసి కాలనీ అభివృద్ధి లో భాగస్వాములు కావాలని, కాలనీ వాసులందరి సమిష్టి కృషి తో ఆదర్శవంతమైన కాలనీ గా తీర్చిదిద్దుతామని కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు పేర్కొన్నారు. ఏ చిన్న సమస్య ఐన తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని, ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని అదేవిధంగా డివిజన్ లో పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా కృషి చేస్తామని ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఎం ఎస్ ఎస్ బి ఇన్చార్జి మేనేజర్ ప్రియాంక, వాటర్ లైన్ మెన్ శ్రీకాంత్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now