డివిజన్లో అభివృద్ధి పనులపై   అధికారులతో సమీక్ష నిర్వహించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు

డివిజన్లో అభివృద్ధి పనులపై

అధికారులతో సమీక్ష నిర్వహించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు

IMG 20250422 WA2509

ఆయుధం ఏప్రిల్ 22: కూకట్‌పల్లి ప్రతినిధి

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని భాగ్య నగర్ ఫేజ్ 1 కాలనీలోని నెలకొన్న పలు సమస్యలు మరియు వాటి పరిష్కారానికై తీసుకోవాల్సిన చర్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై కాలనీ వాసులతో కలిసి భాగ్య నగర్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫీసు లో కాలనీ వాసులతో మరియు అధికారులతో కలసి నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు . ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, భాగ్య నగర్ ఫేజ్ 1 కాలనీలోని నెలకొన్న పలు సమస్యలు మరియు వాటి పరిష్కారానికై తీసుకోవాల్సిన చర్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై కాలనీ వాసులతో కలిసి భాగ్య నగర్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫీసు లో కాలనీ వాసులతో మరియు అధికారులతో కలసి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని చెప్పడం జరిగింది, అలానే వీధి దీపాల సమస్యను కూడా వెంటనే సరిచేయాలని అలానే, కాలనీ లో నెలకొన్న పలు సమస్యలు మరియు వాటి పరిష్కారానికై తీసుకోవాల్సిన చర్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై అన్ని డిపార్ట్మెంట్ వారిని సమన్వయ పరచి, ప్రతి సమస్యను వివరించి, త్వరితగతిన సమస్యలను పరిష్కరించాలని చెప్పడం జరిగింది, అలానే పలు కాలనీ లలో ప్రజల నుండి వచ్చిన వినతి మేరకు మరియు మా దృష్టికి వచ్చిన సమస్యలను పరిగణలోకి తీసుకొని ప్రత్యేక చొరవ తో డివిజన్ లో అత్యవసరం ఉన్న చోట, నిత్యం సమస్యలతో ఉన్న ప్రాంతాలలో ప్రథమ ప్రాధాన్యత గా పనులు పూర్తి చేస్తామని నార్నె శ్రీనివాసరావు తెలియచేశారు. ఏ చిన్న సమస్య అయిన నా దృష్టికి వచ్చిన తప్పకుండా పరిష్కరిస్తామని, కాలనీ లలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ కాలనీలను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకు వెళుతు సమస్య రహిత ఆదర్శవంతమైన కాలనీ లు గా తీర్చిదిద్దడమే నా ప్రథమ లక్ష్యం అని, ప్రజలకు స్వచ్ఛమైన, చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కలిపిస్తామని నార్నె శ్రీనివాసరావు గారు చెప్పడం జరిగినది, అలానే అన్నివేళలా ప్రజలకు అందుబాటులోకి ఉంటానని, మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని,  అదే విధంగా హైదర్ నగర్ డివిజన్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన, అగ్రగామి డివిజన్గా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎండబ్ల్యుఎస్ఎస్బి సూపర్వైజర్ నరేంద్ర, జిహెచ్ఎంసి ఎస్ఆర్పి సత్యనారాయణ, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ దాసు, అసోసియేషన్ సభ్యులు మరియు కాలనీ వాసులు పాల్గొనడం జరిగింది.

Join WhatsApp

Join Now