Site icon PRASHNA AYUDHAM

ఘనంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు.

IMG 20251014 WA0030

ఘనంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు.

శుభాకాంక్షలు తెలిపిన పలువురు నాయకులు కార్యకర్తలు డివిజన్ వాసులు.

ప్రశ్న ఆయుధం, అక్టోబరు 14: కూకట్‌పల్లి ప్రతినిధి

హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు మంగళవారం హైదర్ నగర్ డివిజన్ సమత నగర్ కాలనీ లోని వార్డు కార్యాలయం వద్ద ఘనంగా జరిగాయి.

ఈ వేడుకలకు కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్ , కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ , హైదర్ నగర్ డివిజన్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, కాలనీ అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు, నాయకులు, మహిళా నాయకురాళ్లు పాల్గొని కేక్స్ కట్ చేయించి బోకెలతో, శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు. చర్చ్ పాస్టర్లు అందరూ కలసి నార్నె శ్రీనివాస రావు కొరకు ప్రార్థనలు చేశారు. అలానే వేద పండితులు ఆశీర్వదించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

Exit mobile version