ఫలహారం బండి ఊరేగింపు..పాల్గొన్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్.
ప్రశ్న ఆయుధం, ఆగస్టు 5, శేరిలింగంపల్లి,ప్రతినిధి
శేరిలింగంపల్లి డివిజన్ లోగల లింగంపల్లి విలేజ్ కమిటీ ఆధ్వర్యంలో బోనాల పండుగ సందర్భంగా నిర్వహించిన ఫలహారం బండి ఊరేగింపులో ముఖ్య అతిథులుగా శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. విలేజ్ కమిటీ వారు కార్పొరేటర్ ని శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ..అంగ రంగ వైభవంగా అమ్మవారి ఫలహారం బండి ఊరేగింపు నిర్వహించుకోవడం సంతోషకరమని తెలిపారు. ఊరేగింపును కుల మతాలకు అతీతంగా జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్లవీడీసీ ప్రెసిడెంట్ గడ్డం రవి యాదవ్, అధ్యక్షులు సోమయ్య యాదవ్, మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, కమిటీ జెనరల్ సెక్రటరీ దేవులపల్లి శ్రీనివాస్, పాశం రాజు, అధ్యక్షులు మేకల కృష్ణ, ప్రణయ్ ముదిరాజ్, బుయ్య మల్లేష్ గౌడ్, శ్రీనివాస్, సూర్య రాథోడ్, పిల్లి అనిల్, రవి, నవీన్ గౌడ్, విలేజ్ కమిటీ మెంబర్స్, స్థానికవాసులు తదితరులు పాల్గొన్నారు.