Site icon PRASHNA AYUDHAM

వన మహోత్సవంలో మొక్కలు నాటి సంరక్షించాలి.. -కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్.

IMG 20250711 WA0071

*వన మహోత్సవంలో మొక్కలు నాటి సంరక్షించాలి..*

*-కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్.*

*ప్రశ్న ఆయుధం, జులై 11, శేరిలింగంపల్లి,ప్రతినిధి*

పర్యావరణ పరిరక్షణకు ప్రతీఒక్కరు కృషి చేయాలని శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్. వన మహోత్సవంలో భాగంగా శేరిలింగంపల్లి డివిజన్ లోని శిల్పా గార్డెన్స్ లో శేరిలింగంపల్లి సర్కిల్ డిప్యూటీ కమీషనర్ ప్రశాంతితో, చందానగర్ సర్కిల్ డిప్యూటీ కమీషనర్ శషిరేఖతో, యూబీడి అధికారులతో, స్థానిక అసోసియేషన్ సభ్యులతో కలిసి కార్పొరేటర్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి శిల్పా గార్డెన్స్ లోని గౌతమ్ మోడల్ స్కూల్ విద్యార్థులు పాల్గొని ప్లకార్డులతో ర్యాలీ చేపట్టారు. అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ.. మొక్కలతోనే మానవ మనుగడ సాధ్యమవుతుందని, చెట్ల యొక్క ఆవశ్యకతను తెలియజేస్తూ ప్రతిఒక్కరు మొక్కలు నాటి వాటిని పెంచేలా ప్రోత్సహిస్తూ ఈ వనమహోత్సవాన్ని చేపడుతున్నామని అన్నారు. విద్యార్థులు ఇష్టపడి చదువుతూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. ఈ కార్యక్రమంలో అర్బన్ బయో డైవరసిటీ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ అమృత, మేనేజర్ యూసుఫ్, గోపినగర్ బస్తీ అధ్యక్షులు గోపాల్ యాదవ్, యూబీడి సూపెర్వైసోర్ గోపాల్, శిల్పా గార్డెన్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ హరి కుమార్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ గోపాల్, ట్రెజరర్ గణేష్, జాయింట్ సెక్రటరీ సురేంద్ర, మెంబర్స్ రామ్ కిషోర్, సురేష్, యూ.ర్ రావు, స్థానిక కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version