మహంకాళి నగర్ లో పాదయాత్ర చేసిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్
ప్రశ్న ఆయుధం జూలై 30: కూకట్‌పల్లి ప్రతినిధి
124 ఆల్విన్ కాలనీ డివిజన్ శంషిగుడా పరిధిలోని మహంకాళి నగర్లో రెండు గల్లీలలో సీసీ రోడ్ల నిర్మాణం చాలా కాలం నుండి పెండింగులో ఉందని కాలనీ వాసులు డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకురావడం జరిగింది. కార్పొరేటర్ జి.ఎచ్.ఎం.సి అధికారులతో కలిసి మహంకాళి నగర్ కాలనీ లో పర్యటించి సీసీ రోడ్డు నిర్మాణం కొరకు ఇప్పటికే నిధులు మంజూరై ఉన్నాయి కాబట్టి వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ సీసీ రోడ్డు నిర్మాణ పనులను నాణ్యత ప్రమాణాల విషయంలో రాజీ పడకుండా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. రోడ్డును మంచిగా లెవెలింగ్ చేసి వర్షపు నీరు నిలిచిపోవడం వంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలతో నిర్మాణ పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. రోడ్డుకు ఇరువైపులా చెట్లు పెట్టి కాలనీని పచ్చని వనంలా సుందరంగా మార్చుకోవాలని కాలనీ వాసులకు తెలిపారు. కార్యక్రమంలో శివరాజ్ గౌడ్, గోపాల్, లింగం, సుధాకర్, సత్తయ్య, సంతోష్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.