ఉచిత కంటి పరీక్షల శిబిరాన్ని సందర్శించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్
ప్రశ్న ఆయుధం ఏప్రిల్ 20: కూకట్‌పల్లి ప్రతినిధి
విన్ విజన్ కంటి హాస్పిటల్ వారు 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని సాయి నగర్ వెస్ట్ లో ఏర్పాటుచేసిన ఉచిత కంటి పరీక్షల కేంద్రాన్ని డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ సందర్శించి స్వయంగా కంటి పరీక్షలు చేయించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ నిర్లక్ష్యం చేయకుండా ప్రజలందరూ కంటి పరీక్షలు చేయించుకుని వైద్యుల సలహా తీసుకోవాలని అన్నారు. ఉచిత కంటి పరీక్షల కేంద్రాన్ని ఏర్పాటుచేసిన విన్ విజన్ హాస్పిటల్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలియచేసారు. ఇక్కడ కంటి పరీక్షలు చేయించుకున్న వారు నెల రోజుల లోపు ఎప్పుడు హాస్పిటల్ కు వెళ్లిన అక్కడ కూడా ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తారని హాస్పిటల్ సిబ్బంది తెలియచేసారు. కార్యక్రమంలో జి.ప్రభాకర్, శివరాజ్ గౌడ్, రాజేష్ చంద్ర, భాస్కర్ రెడ్డి, పోశెట్టిగౌడ్, షౌకత్ అలీ మున్నా, శ్రీధర్, సంతోష్ బిరాదర్, ఉమేష్, హరిప్రసాద్, ప్రవీణ్, భగవాన్, రాము, కృష్ణ, రమణ తదితరులు పాల్గొన్నారు.