పారిశుధ్య కార్మికులకు సేఫ్టీ కిట్లు అందించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్.

*పారిశుధ్య కార్మికులకు సేఫ్టీ కిట్లు అందించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్.*

*ప్రశ్న ఆయుధం,జులై 23 శేరిలింగంపల్లి,ప్రతినిధి*

ప్రతిరోజు ఎండనక వాననక పనిచేసే పారిశుధ్య కార్మికుల కొరకు ప్రభుత్వం అందించిన శానిటేషన్ సేఫ్టీ కిట్లను ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ చేతులమీదుగా పారిశుధ్య కార్మికులకు అందించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులకు కావాల్సిన సేఫ్టీ కిట్స్ ను పంపిణీ చేసినట్లు తెలిపారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ ప్రజలు ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవించే విధంగా విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులను అభినందించారు. పరిసరాల పరిశుభ్రతతో పాటు కార్మికులు వారి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ తీసుకుని ప్రభుత్వం అందించిన సేఫ్టీ కిట్లను ప్రతి పారిశుధ్య కార్మికుడు ధరించి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజలు కూడా చెత్త, వ్యర్ధాలు రోడ్లపై వేయకుండా పారిశుధ్య నిర్వహణకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, శివరాజ్ గౌడ్, ఎస్.ఎఫ్.ఏ వెంకట్ రెడ్డి, పారిశుధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment