గుర్తు తెలియని మగ శవం కలకలం

నిజామాబాద్, సెప్టెంబర్ 19 (ప్రశ్న ఆయుధం)

శుక్రవారం రోజు ఉదయం నగరంలోని రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి కింద గుర్తు తెలియని మగ వ్యక్తి శవం గుర్తించబడింది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు 1వ టౌన్ పోలీసులు అక్కడికి చేరుకొని పరిశీలన జరిపారు. మృతుని వయస్సు సుమారు 40 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు.

మృతుడు స్కై బ్లూ రంగు ప్యాంటు ధరించి ఉన్నాడు. శరీరం గుర్తుపట్టలేని స్థితిలో ఉంది. అతని వివరాలు తెలిసిన వారెవరైనా, లేదా ఇటువంటి వయస్సు గల వారు గల్లంతయ్యారని భావిస్తున్న కుటుంబ సభ్యులు ఉన్నట్లయితే, వెంటనే 1వ టౌన్ పోలీస్ స్టేషన్ SHO (ఫోన్ నెంబర్లు: 8712659837, 8712659714) ని సంప్రదించగలరు.

ఎస్ హెచ్ ఓ, 1వ టౌన్ పోలీస్ స్టేషన్, నిజామాబాద్

Join WhatsApp

Join Now