నిజామాబాద్, సెప్టెంబర్ 19 (ప్రశ్న ఆయుధం)
నగరంలోని రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి కింద శుక్రవారం ఉదయం గుర్తు తెలియని మగవారిని మృతదేహంగా గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు 1వ టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని శవాన్ని పరిశీలించారు.
పోలీసుల ప్రకారం, మృతుని వయస్సు సుమారు 40 నుంచి 45 సంవత్సరాల మధ్యగా ఉండవచ్చని తెలిపారు. మృతుడు స్కై బ్లూ రంగు ప్యాంటు ధరించి ఉన్నాడు. అయితే శరీరం చాలా వరకు పాడైపోవడంతో, గుర్తింపు సాధ్యం కావడం లేదు.
మృతుడి వివరాలు తెలిసినవారు, లేదా ఇటువంటి వయస్సు గల వారు గల్లంతయ్యారని అనుమానిస్తున్న కుటుంబ సభ్యులు ఉన్నట్లయితే, వారు 1వ టౌన్ పోలీస్ స్టేషన్ SHO ని వెంటనే సంప్రదించగలరని పోలీస్ శాఖ కోరుతోంది.
సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: 8712659837,
8712659714
— ఎస్ హెచ్ ఓ, 1వ టౌన్ పోలీస్ స్టేషన్, నిజామాబాద్