నిజామాబాద్, సెప్టెంబర్ 25 (ప్రశ్న ఆయుధం)
నగరంలోని లలితమహల్ టాకీస్ ఎదుట గుర్తు తెలియని ఒక మగవ్యక్తి శవం గురువారం ఉదయం కనుగొనబడింది.
పోలీసుల వివరాల ప్రకారం, మృతుడి వయసు సుమారు 55 నుండి 60 సంవత్సరాలు ఉండొచ్చని అంచనా. గత కొన్ని రోజులుగా ఆయన అదే ప్రాంతంలో బిక్షాటన చేస్తూ కనిపించేవాడని స్థానికులు తెలిపారు.
శవాన్ని పరిశీలనకు తరలించిన పోలీసులు, మృతుడి వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. ఎవరైనా ఈ వ్యక్తిని గుర్తించిన వారు లేదా ఇటీవల తమ కుటుంబ సభ్యులు లేదా పరిచితులు గల్లంతయ్యారని అనుమానించే వారు ఉంటే, వెంటనే 3వ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ హరిబాబును సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.
సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు:
📞 87126 59839
📞 87126 59717