నేడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్.
ఉ.8 గంటలకు ప్రారంభంకానున్న ఓట్ల లెక్కింపు.
కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేసిన ఎన్నికల కమిషన్.
కౌంటింగ్ కేంద్రాల దగ్గర పటిష్ఠ భద్రత.
19 కౌంటింగ్ కేంద్రాల దగ్గర 10 వేల మందితో భద్రత.
మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు.
అనంతరం ఈవీఎం ఓట్లను లెక్కించనున్న సిబ్బంది.
ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 స్థానాలు.
అధికారం దక్కాలంటే 36 స్థానాలు తప్పనిసరి.
మధ్యాహ్నంలోగా ఫలితాలు వెలువడే అవకాశం.
నేడు తేలనున్న 699 మంది అభ్యర్థుల భవితవ్యం.
ఈ ఎన్నికల్లో ఆప్, బీజేపీ మధ్యే ప్రధాన పోరు.
బీజేపీ వైపే మొగ్గుచూపిన ఎగ్జిట్‌పోల్స్.
50కి పైగా సీట్లు గెలుస్తామంటున్న బీజేపీ.
ఎగ్జిట్‌పోల్స్‌ను కొట్టిపారేసిన కేజ్రీవాల్.
నాలుగోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఆప్ ధీమా.
ఈసారి ఖాతా తెరుస్తామంటున్న కాంగ్రెస్.
తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్నారని ఆప్ ఆరోపణ.
ఆప్ ఎమ్మెల్యేలకు బీజేపీ డబ్బు ఎరవేస్తోందని ఆగ్రహం.
ఆప్ నేతల ఆరోపణలపై దర్యాప్తునకు ఆదేశించిన ఎల్జీ.
నిన్న కేజ్రీవాల్‌కు ఏసీబీ అధికారుల నోటీసులు.
ఆరోపణలపై ఆధారాలు సమర్పించాలని కోరిన ఏసీబీ.
ఢిల్లీ ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ…..