సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నవంబరు 17 (ప్రశ్న ఆయుధం న్యూస్): జాతీయ న్యాయ సేవాధికార సంస్థ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.భవానిచంద్ర మార్గదర్శకత్వంలో సోమవారం గ్రేస్ వృద్ధాశ్రమాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.సౌజన్య సందర్శించి తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వృద్ధుల పట్ల చిన్న చూపు చూడకుండా, వారి బాగోగులు చూసుకుంటూ గౌరవంగా చూడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సూచించారు. వృద్ధాశ్రమంలో పరిశుభ్రత, ఆహార సేవలు, వైద్య సౌకర్యాలు వంటి అంశాలను పరిశీలించిన ఆమె, పరిసరాలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. న్యాయ సంబంధిత విషయాల్లో అవసరమైతే ఉచిత న్యాయ సేవలను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అందిస్తుందనీ, ఏ న్యాయ సహాయం కావాలన్నా సంగారెడ్డి సంస్థ కార్యాలయంను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రేస్ వృద్ధాశ్రమం అధికారులు, వృద్ధులు తదితరులు పాల్గొన్నారు.
గ్రేస్ వృద్ధాశ్రమాన్ని తనిఖీ చేసిన న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య
Published On: November 17, 2025 6:30 pm