Site icon PRASHNA AYUDHAM

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఎన్నికల హామీలను అమలు చేయాలి

అమలు

{"remix_data":[],"remix_entry_point":"challenges","source_tags":[],"origin":"unknown","total_draw_time":0,"total_draw_actions":0,"layers_used":0,"brushes_used":0,"photos_added":0,"total_editor_actions":{},"tools_used":{},"is_sticker":false,"edited_since_last_sticker_save":false,"containsFTESticker":false}

Headlines:
  1. “సిపిఎం: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల హామీలు అమలు చేయాలి”
  2. “జమ్మికుంటలో సిపిఎం మహాసభ: మిల్కూరి వాసుదేవ రెడ్డి వ్యాఖ్యలు”
  3. “బిజెపి ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజలపై అన్యాయంగా వ్యవహరిస్తోంది”
  4. “పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్”

*సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి*

*జమ్మికుంట అక్టోబర్ 29 ప్రశ్న ఆయుధం:-*

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ వెంటనే అమలు చేయాలని అమలు చేసేవరకు ప్రజల పక్షాన సిపిఎం శ్రేణులు ఉద్యమించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసు దేవ రెడ్డి అన్నారు. మంగళవారం రోజున సిపిఎం జమ్మికుంట మండల మూడవ మహాసభల సందర్భంగా మోత్కుల గూడెం చౌరస్తా నుండి గాంధీ చౌక్ మీదుగా వర్తక సంఘం భవనం వరకు ర్యాలీ, ప్రదర్శన నిర్వహించారు మహాసభల సూచికగా పార్టీ పతాకాన్ని సీనియర్ నాయకులు కొప్పుల శంకర్ ఆవిష్కరించారు అనంతరం ప్రతినిధుల సభ నిర్వహించారు ముందుగా ఇటీవల మృతి చెందిన పార్టీ ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి అమరవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించారు మహాసభకు బాసిర సంపత్ రావు అధ్యక్షత వహించారు సభకు హాజరైన వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అనేక హామీలు ఇచ్చి నేటికీ అమలు చేయలేదన్నారు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తూ పేద మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తుందని నిత్యవసర ధరలు విపరీతంగా పెంచిందని ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిత్యవసర వస్తువులపై టాక్సీలు పెంచడంతో నిత్యవసర వస్తువుల ధరలు అమాంతంగా పెరిగాయని దేశభక్తి పేరుతో దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను నేషనల్ మోనిటేషన్ పైప్ లైన్ పేరుతో ఆరు లక్షల కోట్ల విలువైన ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేశారని పెట్రోల్ డీజిల్ ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు 2024 ఏప్రిల్ నుండి అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్ కు 89.40 డాలర్ల నుండి 73. 59 డాలర్లకు పడిపోయిందని దాదాపు 18 శాతం మేర తగ్గిందన్నారు కానీ మోడీ ప్రభుత్వ ఆదేశాల మేరకు చమురు ఉత్పత్తి కంపెనీలు దేశంలో రిటైల్లో పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించలేదని పెట్రోల్ డీజిల్ ధరలు అధిక ద్రవ్యోల్బణానికి దోహదపడతాయని కూరగాయలు, ఆహార ధాన్యాలు, ఇతర నిత్యవసర వస్తువుల ధరలు పెరగడానికి కారణం అవుతాయని పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు కేంద్ర క్యాబినెట్ ఇటీవల ఆమోదించిన ఒకే దేశం ఒకే ఎన్నిక భావనను సిపిఎం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని పార్లమెంటు శాసనసభ, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి తీసుకునే చర్యలు పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకు సమైక్య వ్యవస్థకు విఘాతం కలిగిస్తాయన్నారు రాష్ట్రాల శాసనసభకు ఐదేళ్ల కాలపరిమితి కల్పిస్తున్న రాజ్యాంగాన్ని ఇది ఉల్లంఘిస్తుందని రాష్ట్రాల హక్కులను నలిపేసే జమిలీ ఎన్నికలను తిరస్కరించాలని పేర్కొన్నారు ఇజ్రాయిల్ కు ఆయుధాల ఎగుమతులపై తక్షణమే నిషేధం విధించాలన్నారు దేశంలో మహిళలపై అత్యాచారాలు హత్యలు లైంగిక వేధింపులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు అనేక రకాలుగా మహిళలు హింసకు గురవుతూనే ఉన్నారని మహిళల రక్షణ కోసం సమగ్రమైన చట్టాలు రూపొందించాలని బాధితులకు న్యాయం జరిగేంత వరకు అన్ని విధాల సహాయం అందించాలన్నారు మండలంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేసి భవిష్యత్తు ఆందోళన పోరాట కార్యక్రమాలను రూపొందించుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు ఈ మహాసభలో జిల్లా కమిటీ సభ్యులు శీలం అశోక్ జోన్ కమిటీ సభ్యులు కొప్పుల శంకర్, జక్కుల రమేష్ యాదవ్ ఇల్లంధకుంట ప్రజా సంఘాల కన్వీనర్ చెల్పూరి రాములు మండల నాయకులు రావుల ఓదెలు బైరం సమ్మయ్య గడ్డం శోభన్,వడ్లూరి కిషోర్ క్రాంతి ఖలీల్ పాషా, ప్రసాద్, పోచయ్య, కిరణ్, రాజు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version