పాలకొండ లో సిపిఐ జిల్లా 2వ మహాసభలు
పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి జులై 29 ( ప్రశ్న ఆయుధం న్యూస్ ) దత్తి మహేశ్వరరావు
గరుగుబిల్లి సూరయ్య
సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు,
పాలకొండ లో జరుగు భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా 2వ జిల్లా మహాసభలలో జిల్లా ప్రజానీకం పాల్గొని జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు గరుగుబిల్లి సూరయ్య పిలుపునిచ్చారు, మొoడెoకల్ సంత లో జిల్లా మహాసభలు గూర్చి విస్తృత ప్రచారం నిర్వహించడం జరిగింది, ఈ సందర్బంగా మాట్లాడుతూ,,
దేశాన్ని కార్పొరేట్ల, మతోన్మాదo నుండి కాపాడుకోవడానికి
రైతు మెడకు ఉరితాడులా కేంద్ర నూతన చట్టాలు:కార్మిక హక్కులు హరించేలా నాలుగు లేబర్ కోడ్ లు అమలు:
లౌకిక , ప్రజాస్వామ్య, రాజ్యాంగం ప్రమాదంలో పడేలా కేంద్ర పరిపాలన:
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక ప్రజావ్యతిరేక విధానం వ్యతిరేకించండ0 కోసం
కేంద్ర ప్రభుత్వ కార్పోరేట్ అనుకూల విధానాల వ్యతిరేకించండo కోసం .
రైతులు పండించే అన్ని పంటలు కు మద్దతు ధరలు చట్టం చేయాలని,ఉపాధి పనులు 200రోజులు కల్పించాలి, 600రూపాయలు కూలి ఇవ్వాలని
కార్మిక హక్కులను హరించే నాలుగు లేబర్ కోడ్ లు రద్దు చేయాలని .
వ్యవసాయ మార్కెట్లను నిర్వీర్యం చేసే నేషనల్ ప్రేమ్ వర్క్ పాలసీ వెనక్కి తీసుకోవాలని. కో-ఆపరేటివ్ వ్యవస్థలను ధ్వంసం చేసే కేంద్ర ప్రభుత్వ నేషనల్ కో-ఆపరేటివ్ పాలసీని వెనక్కి తీసుకోవాలని అలాగే జిల్లా వెనుకబాటు పైన పాలకుల నిర్లక్ష్యం గూర్చి చర్చించి భవిష్యత్ పోరాటాలకు రూపుకల్పన చేస్తామన్నారు, ఈ కార్యక్రమం లో జిల్లా సమితి సభ్యులు పువ్వల ప్రసాద్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బొత్స మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు,,