Site icon PRASHNA AYUDHAM

పాల్వంచ స్వచ్చ కార్మికుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా

స్వచ్ఛ కార్మికులకు సిపిఐ, ఏఐటీయూసీ అండగా
ఉంటుంది

వేతనాల చెల్లింపు సమస్యను త్వరలో పరిష్కరిస్తాం

కూనంనేని చొరవతో వేతనాల చెల్లింపు సమస్య పరిస్కారం అవుతుంది

పాల్వంచ మున్సిపల్ శాఖలో పనిచేస్తున్న స్వచ్ఛ కార్మికులకు సిపిఐ, ఏఐటీయూసీ అండగా ఉంటుందని, వేతనాలకు సంబందించిన సమస్యను త్వరలో పరిష్కరించేందుకు స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కృషి చేస్తున్నారని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి, ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షులు ఎస్ కె సాబీర్ పాషా తెలిపారు. స్థానిక సిపిఐ జిల్లా కార్యాలయం ‘శేషగిరిభవన్’లో బుధవారం జరిగిన పాల్వంచ మున్సిపల్ స్వచ్ఛ కార్మికుల సమావేశంలో అయన పాల్గొని మాట్లాడారు. కొత్తగూడెం, ఇల్లందు మున్సిపాలిటీల్లో ఆయా మున్సిపల్ శాఖల నుంచి వేతనాలు చెల్లింస్తుండగా పాల్వంచ మున్సిపాలిటీలో అందుకు భిన్నంగా కుటుంబ యజమానులనుంచి డబ్బులు వాసులు చేసుకోవాలనే నిబంధన వల్ల కార్మికులు నష్టపోతున్నారన్నారు. కుటుంబ యజమానులనుంచి కార్మికులు చీదరింపులకు గురి అవుతున్నారన్నారు. మున్సిపల్ శాఖా ద్వారా వేతనాలు చెల్లించేందుకు స్థానిక ఎమ్మెల్యే కృషి చేస్తున్నారని, ఇప్పటికే జిల్లా కలెక్టర్, మున్సిపల్ శాఖా మంత్రి, ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లారని, త్వరలో సమస్యకు పరిస్కారం లభిస్తుందన్నారు. కార్మికులకు అన్యాయం జరగనివ్వబోమని వారికి అండగా నిలబడి న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు. సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కంచర్ల జమలయ్య, నాయకులు పాటి మోహన్, బాలాజీ, నాగరాజు, పాషా, హుస్సేన్, కార్తీక్, లాలూ, సంధ్య, రాము, రాణి తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version