Headlines:
-
“జర్నలిస్టులపై దాడులు: CPI(ML) దుర్మార్గాలను ఖండిస్తుంది”
-
“ప్రజాస్వామ్యపు నాలుగో స్తంభం: విలేకరుల రక్షణపై డిమాండ్”
-
“చర్ల మండలంలో జర్నలిస్టులపై దాడులకు నిరసన”
-
“CPI(ML) ఎంఎల్ మాస్ లైన్ మీడియా మిత్రులపై దాడులకు కండెం”
జర్నలిస్టుల పై దాడికి పాల్పడ్డ దుర్మార్గులను తక్షణమే గుర్తించి శిక్షించాలి.
మరల ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టి మీడియా మిత్రులకు రక్షణ కల్పించాలి.
సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజా పంథా పార్టీ చర్ల మండల కార్యదర్శి కొండా కౌశిక్ డిమాండ్.
చర్ల మండలంలో ఇటీవల కాలంలోనే ఇద్దరు జర్నలిస్టులపై జరిగిన దాడుల పట్ల సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజా పంథా పార్టీ అట్టి ఘటనలను తీవ్రంగా ఖండిస్తున్నామని పార్టీ మండల కార్యదర్శి కొండా కౌశిక్ మంగళవారం తెలిపారు.ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ పత్రికలకు ప్రజాస్వామ్యపు నాలుగో స్తంభం అని పేరొచ్చిందంటే ఆ పేరు ఊరికే రాలేదని అది గాలికి ఊడిపడ్డ పేరుకాదని ఎవరో దయతలిచి ఇచ్చింది అంతకంటేకాదని చరిత్రలో పత్రికలు నిర్వహించినటువంటి అమోఘమైన, స్లాగనీయమైనటువంటి,పాత్రవల్ల వచ్చిన గొప్పతనమని ఆ కిర్తే గతంలో పత్రికలు నిర్వహించినటువంటి పాత్ర సాధించిపెట్టిందని వారు అన్నారు.చరిత్రలో పత్రికలు ప్రజలను చైతన్య పరిచాయని,వాళ్ళను కదిలించి సంఘటిత పరిచాయని,ప్రజలకు మేలు జరిగే పనులలో పత్రికలు మమేకం అయ్యాయని వారు తెలిపారు. అటు ప్రభుత్వాలకు ఇటు ప్రజలకు మధ్య వారధిగా వుంటూ ప్రజాసమస్యల పరిష్కరంకై తన వంతు కృషి చేసేవాడే విలేకరి అని అన్నారు. అలాంటి గౌరవ బాధ్యతలో ఉన్నటువంటి విలేకరులు చర్ల లో కొనసాగుతున్న గంజాయి మీద, గుడుంబా మీద నిజాన్ని నిర్భయంగా వార్తలు రాసినటువంటి సమయాల్లో కొంతమంది గుర్తు తెలియని దుండగులు దాడులకు పాల్పడం దుర్మార్గం అని ప్రజాపందా పార్టీ భావిస్తుందని అన్నారు. దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. తక్షణమే మరలా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా సమందిత అధికారులు దాడికి పాల్పడ్డ దుండగులను గుర్తించి తగిన బుద్ధి చెప్పాలని తద్వారా మీడియా మిత్రులకు రక్షణ కల్పించాలని ఆయన కోరారు. జర్నలిస్టు మిత్రులని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని తెలిపారు.జర్నలిస్టులందరూ ఐక్యమత్యంతో ముందుకు సాగి ఇలాంటి దుర్మార్గులకు కచ్చితంగా బుద్ధి చెప్పాలని ఆయన తెలిపారు.