ఇళ్ల స్థలాల కోసం గిరిజనుల ఆందోళన: గుమ్మలక్ష్మీపురంలో సీపీఐ మద్దతు

*ఇళ్ల స్థలాల కోసం గిరిజనుల ఆందోళన: గుమ్మలక్ష్మీపురంలో సీపీఐ మద్దతు*

పార్వతీపురం మన్యం జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 14( ప్రశ్న ఆయుధం న్యూస్ )దత్తి మెహెశ్వరావు

ఇళ్లస్థల సాధించేంతవరకు పోరాడతాo! సిపిఐ

ఇళ్ల స్థలాల సాధించేంతవరకు పోరాడుతామని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోట జీవన్న అన్నారు, గుమ్మలక్ష్మీపురంలో గతంలో నిర్వహించిన ఇళ్ల స్థలాలు ఎల్విన్ పేట రెసిడెన్షియల్ స్కూలు ప్రక్కన ఉన్న స్థలము )పోరాట స్థలమును సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు గరుగు బిల్లి సూరయ్య కుoడంగి లింగరాజు ఇతర సీపీఐ నాయకులు ఇళ్ల స్థలాలు లబ్ధిదారులతో కలిసి ఇళ్ల స్థలాల పోరాట కేంద్రంను పరిశీలించడం జరిగింది . ఈ సందర్భంగా తోట జీవన్న మాట్లాడుతూ, గత సంవత్సరం గుమ్మలక్ష్మీపురం రెసిడెన్సియల్ స్కూల్ ప్రక్కన ఉన్న ప్రభుత్వ భూమిలో సుమారు 350 మంది ఇల్లు లేని పేద గిరిజనులందరూ తుప్పలు, డొంకలు నరికి చదును చేశారన్నారు, ఈ సందర్భంగా పోరాటానికి నాయకత్వం వహించిన సిపిఐ నాయకత్వంపై ఫారెస్ట్ పోలీసులు స్థానిక వీఆర్వోలు మరి కొంతమంది నకిలీ గిరిజనులతో కేసు పెట్టడం జరిగింది, సిపిఐ నాయకులు కురుపాం కోర్టుకు వాయిదాల నిమిత్తము వెళ్ళడం జరుగుతుంది, ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన సందర్భంగా కురుపాము శాసనసభ్యురాలు జగదీశ్వరి మేడమ్ ని సిపిఐ నాయకత్వంలో కలిసి ఇళ్ల స్థలాలు పంచాలని అడిగి ఉన్నాము, ప్రభుత్వ ఏర్పడి పది మాసాలవుతున్న సందర్భంగా మరల ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఎమ్మెల్యే కి విన్నవించుకోవడం జరుగుతుంది, సిపిఐ నాయకత్వం పైన ఇళ్లస్థలాల పోరాటంలో పాల్గొన్న గిరిజనుల పైన కేసులు పెడుతూ, బెదిరింపులు చేస్తూ కేసులు పెట్టినా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఇళ్లస్థలాలు సాధించేంతవరకు పోరాడుతామని ఆయన చెప్పారు, ఇళ్లస్థల పోరాటంలో లబ్ధిదారులు అందరు కూడా మరల పోరాటానికి సమాయత్తం అవ్వాలని పిలుపునిచ్చారు

ఏప్రిల్ 9వ

తేదీన ఎమ్మార్వో కి వినతిపత్రాలు

గతంలో గుమ్మలక్ష్మీపురం ఎమ్మార్వో ఆఫీస్ కి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఇళ్ల స్థలాలు పోరాటంలో పాల్గొన్న లబ్ధిదారులందరూ కూడా వ్యక్తిగత దరఖాస్తులు ఇవ్వడమైనది, మరలా కూడా తొమ్మిదవ తేదీన ఇళ్ల స్థలాలు వెంటనే ఇవ్వాలని వ్యక్తిగత అర్జీలు సమర్పించడం జరుగుతుంది, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని 9వ తేదీన పోరాటంలో పాల్గొన్న లబ్ధిదారులందరూ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు,,,,

Join WhatsApp

Join Now

Leave a Comment