సంగారెడ్డి ప్రతినిధి, జనవరి 27 (ప్రశ్న ఆయుధం న్యూస్): రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై రాష్ట్ర మహాసభలో చర్చించి పలు కీలక అంశాలపై తీర్మానాలను ఆమోదించామని సీపీఐఎం కార్యదర్శివర్గ సభ్యులు ఎస్. వీరయ్య, మల్లు లక్ష్మి తెలిపారు. సంగారెడ్డిలోని నగర్ లోని మల్లు స్వరాజ్యం ప్రాంగణం (గోకుల్ గార్డెన్)లో ఈ నెల 25 నుంచి 28 తేదీలలో జరుగుతున్న రాష్ట్ర 4వ మహాసభల సందర్భంగా మీడియా పాయింట్ లో చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. నాలుగు రోజుల పాటు జరుగుతున్న రాష్ట్ర మహాసభలో రాష్ట్రంలోని వివిధ ప్రధాన అంశాలపై చర్చించినట్లు వారు తెలిపారు. దేశ ప్రజలకు అన్నం పెట్టెందుకు రైతాంగం పండిస్తున్న పంటలకు కనీసం మద్దతు ధర కల్పించేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ మహాసభ తీర్మానం చేసినట్టు పేర్కొన్నారు. కనీస మధ్యతరాల చట్టం కోసం రైతాంగం దేశవ్యాప్తంగా సమరసిలంగా పోరాడుతున్న పరిస్థితి ఉందన్నారు. ఎన్నికల ముందు ప్రధాని మోదీ కనీసం మధ్యతర చట్టం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక మోసం చేశారని విమర్శించారు. ఆరు పంటలకు బోనస్ ఇస్తామని నాలుగు పంటలకు కనీసం మధ్యతర కల్పిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా రైతాంగ సమస్యలను పక్కన పెట్టిందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో కోటి 30లక్షల మంది కార్మికులు కనీస వేతనాలకు నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ విడుదల చేసిన కనీస వేతనాలు జీవో సిగ్గుచేటుగా ఉందన్నారు. రోజుకు 175 రూపాయలు కూలి ఇస్తే సంబర పడాలని చెప్పడం నిసిగ్గుగా ఉందన్నారు. నెలకు రూ.4628 కుటుంబ పోషణకు సరిపోతాయని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఏ బీజేపీ నాయకుడైనా సరే ఆ వేతనంతో తమ కుటుంబాన్ని కడుపుకోగలడా అని ప్రశ్నించారు. పదివేల కనీస వేతనం నిర్ణయించారని, ప్రతి ఐదేళ్లకోసారి కనీస వేతనాలను పునర్ నిర్ణయం చేయాల్సి ఉందన్నారు. ఇప్పటికే మూడు పర్యాయాలు పెంచాల్సి నా కనీస వేతనాలు అమలుకు నోచుకోలేదన్నారు. కనీస వేతనాలను పెంచితే ప్రభుత్వానికి పైసా ఖర్చు ఉండదని అయినా పెట్టుబడుదారులు కార్పొరేటర్ లాభాల కోసం కార్మికుల కనీస వేతనాలు పెంచేందుకు సిద్ధపడటం లేదని విమర్శించారు. 73 షెడ్యూల్ ఇండస్ట్రీలకు కనీస వేతనాల ముసాయి దాని విడుదల చేసి రూ.11000 ఇస్తే సరిపోతుందని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం దూరంగా ఉందన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం రాబోయే కాలంలో ఐక్య పోరాటాలు నిర్వహించేందుకు ఉద్యమ కార్యాచరణను మహాసభలో ఖరారు చేయనున్నట్లు పేర్కొన్నారు.
*సొంతిల్లు అనేది ఆత్మగౌరవ సమస్య: మల్లు లక్ష్మి*
సొంతిల్లు అనేది ఆత్మగౌరవ సమస్యగా ఉంటుందని పేదలకు ఇండ్లు ఇళ్లస్థలాలు ఇచ్చే విషయంలో గత 15 టిఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రెండు కూడా ఒకేలా వివరిస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి దుయ్యబట్టారు. టిఆర్ఎస్ ప్రభుత్వంలో డబల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించి ఇస్తామని చెప్పిన రాష్ట్రంలో ఏ పేదలకు కూడా ఇళ్ల కేటాయింపు జరగలేదన్నారు టిఆర్ఎస్ నియంతృత ప్రభుత్వాన్ని కాదనుకొని కాంగ్రెస్కు ఓట్లు వేసిన ప్రజలకు ఈ ప్రభుత్వం కూడా తీరని అన్యాయమే చేస్తుందని పేర్కొన్నారు. సీపీఎం పోరాటాల ఫలితంగా సీఎం రేవంత్ రెడ్డి జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా రాష్ట్రంలోని 11 నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి 3500 చొప్పున మంజూరు చేస్తామని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నికల ముందు ఇంటి నిర్మాణానికి ఆరు లక్షల ఇస్తామన్న ప్రభుత్వం ఇప్పుడు కేవలం ఐదు లక్షలు మాత్రమే ప్రకటించడం సరైనది కాదన్నారు కేరళలో లెఫ్ట్ ప్రభుత్వం పేదల ఇండ్ల నిర్మాణం కోసం పది లక్షల రూపాయల చొప్పున ఇస్తుందని, ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంటి నిర్మాణ వ్యయం పెరుగుతున్నందున లబ్ధిదారునికి 15 లక్షల చొప్పున ఆర్థిక సహాయం చేయాలని మహాసభ డిమాండ్ చేసినట్టు ఆమె వివరించారు. ఇంటి స్థలాలు లేని పేదలకు అన్యాయం చేస్తే సహించేది లేదన్నారు రాష్ట్రంలో లక్షకు పైగా పేదలు ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకొని పోరాటం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధాన్ని ప్రయోగించి కేసులు పెట్టి భయబ్రాంతుల గురి చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భే షరతుగా పేదలపై పెట్టిన కేసుల్ని వెంటనే ఎత్తివేయాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద రాష్ట్రంలో 2.5 లక్షల ఇళ్లు మంజూరు చేసినట్టుగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పార్లమెంటులో ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో ప్రధానమంత్రి అవాజ్ యోజన కింద పేదలకు ఇల్లు ఇచ్చారో చూపించాలని ఆమె నిలదీశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు ఇల్లు, ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయంలో దోబూచులాడుతున్నాయని పేర్కొన్నారు. రాబోయే కాలంలో పేదలకు ఇల్లు, ఇళ్ల స్థలాలు మంజూరు చేసే వరకు సమరశీలంగా ప్రజా పోరాటాలు నిర్వహించాలని మహాసభ ఉద్యమ కర్తవ్యంగా ఎంచుకుందని తెలిపారు. స్థలాలు లేని పేదలను గుర్తించి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న బంజరు, ప్రభుత్వ భూములను ఇళ్ల స్థలాల కోసం కేటాయించి పేదలకు పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా జాతీయ ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న గ్రామీణ పేదలకు సంవత్సరానికి 200 పని దినాలు, రోజుకు రూ. 600 వేతనం చెల్లించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకానికి నిధుల కేటాయింపులు తగ్గిస్తూ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న గ్రామీణ పేదలకు ఆధార్ సంబంధం లేకుండా పని కల్పిస్తూ పేమెంట్స్ చెల్లించాలని కోరారు. పట్టణాలలో విలీనం చేసిన గ్రామాల్లో కూడా ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. మూసి ప్రక్షాళన పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పేదల ఇల్లును కూల్చివేయడం దారుణమైన విషయమన్నారు. దశాబ్దాలకు పైగా పేదలు ఇల్లు కట్టుకొని జీవిస్తుంటే ఉన్నట్టుండి బుల్డోజర్లు పెట్టి నీలమట్టం చేయడం దుర్మార్గమైన పాలన అని ఆమె దుయ్యబట్టారు. పేరుట కార్పోరేట్ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుగా మార్చుకొని దోచుకోవాలని చూస్తుందని విమర్శించారు. మహాసభల్లో చర్చించి ఆమోదించిన ప్రజా సమస్యలపై రాబోయే కాలంలో మరింత మిలిటెంట్ పోరాటాలకు సీపీఐఎం సన్నద్ధమవుతుందని తెలిపారు. ఈ సమావేశంలో సీపీఐఎం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం. అడివయ్య తదితరులు పాల్గొన్నారు.