వయనాడ్ వరద బాధితులకు సిపిఎం ఆధ్వర్యంలో విరాళాల సేకరణ.
సిపిఎం సిద్దిపేట అర్బన్ మండల కార్యదర్శి చొప్పరి రవికుమార్.
సిద్దిపేట ఆగస్టు 4 ప్రశ్న ఆయుధం :
ఇటీవల భారీ వర్షాలతో నష్టపోయిన కేరళ రాష్ట్రం వయనాడ్ కు వరద బాధితులకి చేయూతనందించడానికి సిపిఎం సిద్దిపేట అర్బన్ కమిటీ ఆధ్వర్యంలో నిధి సేకరణ చేయడం జరిగిందని సిపిఎం అర్బన్ మండల కార్యదర్శి చొప్పరి రవికుమార్ తెలిపారు. ఇటీవల కాలంలో కరుడు బ్రష్టు తో అతి భారీ వర్షాలు కురిసి కేరళ రాష్ట్రంలోని వైనాడ్ జిల్లాలో కొండ చర్యలు విరిగిపడి వందలాది మంది చనిపోయారు వారి కుటుంబాలకు చేయూతను అందించడానికి సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నిధి సేకరణ చేసి వారికి అందించాలని, వారి కుటుంబాలకు భరోసా నింపేందుకు ప్రతి ఒక్కరు చేయుతనందించాలని షాప్ టు షాపు తిరిగి నిధి సేకరణ చేయడం జరిగిందన్నారు. వీటిని సిపిఎం రాష్ట్ర కమిటీ ద్వారా కేరళ రాష్ట్రంలోని వైనాడ్ ప్రాంతానికి చెందిన వరద బాధితులకు ఈ నిధిని అందిస్తామని వారు తెలిపారు. ఈ నిధి కార్యక్రమానికి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యురాలు జాలిగపు శిరీష, అర్బన్ మండల కమిటీ సభ్యుడు కొండం సంజు కుమార్ , అభిషేక్ తదితరులు పాల్గొన్నారు.