సంగారెడ్డి లో జరిగే సిపిఎం రాష్ట్ర నాలుగో మహాసభలు విజయవంతం చేయండి -సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్

సంగారెడ్డి లో జరిగే సిపిఎం రాష్ట్ర నాలుగో మహాసభలు విజయవంతం చేయండి

-సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్

 

ప్రశ్న ఆయుధం కామారెడ్డి జిల్లా ప్రతినిధి జనవరి 4:

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్థానిక సిపిఎం జిల్లా కార్యాలయంలో సిపిఎం నాలుగో మహాసభల కరపత్రాలను విడుదల చేయడం జరిగింది.ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి కే చంద్రశేఖర్ మాట్లాడుతూ ఈనెల 25 నుండి 28వ తేదీ వరకు సంగారెడ్డి పట్టణంలో భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) సిపిఎం రాష్ట్ర మహాసభలు జరగనున్నాయని ఆ మహాసభలను విజయవంతం చేయాలని కోరారు రాష్ట్ర మహాసభల సందర్భంగా ఇంటింటికి సిపిఎం పేరుతో ఈ 20 రోజుల పాటు సిపిఎం కార్యకర్తలు ప్రతి ఒక్క ఇంటికి వెళ్తారని కావున ప్రజలు సహకరించాలని అన్నారు అదేవిధంగా ఈ రాష్ట్ర మహాసభలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చలు జరిపి వారి సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని కావున ప్రజలు ఈ మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వెంకాట్ గౌడ్, మోతిరామ్ నాయక్, కొత్త నర్సింలు ,జిల్లా కమిటీ సభ్యులు అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now