*నిత్యవసర ధరలు తగ్గించాలి*
*జమిలి ఎన్నికలు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం*
*సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి*
*కరీంనగర్ ప్రశ్న ఆయుధం అక్టోబర్ 8*
విపరీతంగా పెరిగిన నిత్యవసర సరుకుల ధరలు తగ్గించాలని, పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తూ, పేద, మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తుందని, పెరిగిన నిత్యవసర ధరలు వెంటనే తగ్గించాలని పెట్రోల్ డీజిల్ ధరలను జిఎస్టి పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిత్యవసర వస్తువులపై అధికంగా టాక్సీలు పెంచడంతో నిత్యవసర వస్తువుల ధరలు అమాంతంగా పెరిగాయన్నారు నరేంద్ర మోడీ దేశం కోసం,ధర్మం కోసం అంటూ దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ కంపెనీలకు అమ్ముకుంటున్నారని,నేషనల్ మోనిటేషన్ పైప్ లైన్ పేరుతో ఆరు లక్షల కోట్ల విలువైన ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేశారని అన్నారు.
2024 ఏప్రిల్ నుండి అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్ కి 89.40 డాలర్ల నుండి 73. 59 డాలర్లకు పడిపోయిందని, దాదాపు 18 శాతం మేర తగ్గిందన్నారు.
అయినా మోడీ ప్రభుత్వ ఆదేశాల మేరకు చమురు ఉత్పత్తి కంపెనీలు దేశంలో రిటైల్లో పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించలేదన్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు అధిక ద్రవ్యోల్బణానికి దోహదపడుతున్నాయన్నారు. కూరగాయలు, ఆహార ధాన్యాలు, ఇతర నిత్యవసర వస్తువుల ధరలు పెరగడానికి కారణం అవుతాయన్నారు పెట్రోల్ డీజిల్ రిటైల్ ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు. కేంద్ర క్యాబినెట్ ఇటీవల ఆమోదించిన ఒకే దేశం ఒకే ఎన్నిక భావనను సిపిఎం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది అన్నారు పార్లమెంటు శాసనసభ స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి తీసుకునే చర్యలు పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకు, సమైక్య వ్యవస్థకు విఘాతం కలిగిస్తాయన్నారు రాష్ట్రాల శాసనసభకు ఐదేళ్ల కాలపరిమితి కల్పిస్తున్న రాజ్యాంగాన్ని ఇది ఉల్లంఘిస్తుంది అన్నారు రాష్ట్రాల హక్కులను నులిపేసే జమిలీ ఎన్నికలను తిరస్కరించాలని ఉన్నారు మణిపూర్ లో హింస ఇంకా కొనసాగుతూనే ఉందని ఈ16నెలల కాలంలో ప్రధాని మోడీ ఒక్కసారి కూడా ఆ రాష్ట్ర పర్యటనకు వెళ్లలేదన్నారు, సమస్య పరిష్కారానికి అవసరమైన రాజకీయ చర్చలు తీసుకోవాలని, రాష్ట్ర ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ ను తొలగించాలని డిమాండ్ చేశారు. ఇజ్రాయిల్ కు ఆయుధాల ఎగుమతులపై తక్షణమే నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న కేంద్ర బిజెపి ప్రభుత్వ వైఖరిని నవంబర్ 15 వరకు సభలు,సమావేశాలు, సదస్సుల ద్వారా ప్రజానీకానికి వివరిస్తూ, ఎండగడతామన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వర్ణ వెంకటరెడ్డి గుడికందుల సత్యం జిల్లా కమిటీ సభ్యులు యు.శ్రీనివాస్ సుంకరి సంపత్ ఎడ్ల రమేష్,నరేష్ పటేల్ జిల్లా నాయకులు జి.తిరుపతి, తిప్పారపు సురేష్, గజ్జల శ్రీకాంత్,కాంపల్లి అరవింద్, రాయికంటి శ్రీనివాస్,గుండేటి వాసుదేవ్,గాజుల కనకరాజు వినయ్ కుమార్,రోహిత్, జగదీష్,మల్లారెడ్డి, సత్యనారాయణ చారి,బోగేష్ తదితరులు పాల్గొన్నారు.