ప్రజా ఉద్యమాల సారధి సిపిఎం!

ప్రజా ఉద్యమాల సారధి సిపిఎం

 

సిపిఎం సిద్దిపేట జిల్లా మహాసభల

 

ఆహ్వాన సంఘం చైర్మన్ గా చుక్కా రాములు

 

గజ్వేల్ అక్టోబర్ 27 ప్రశ్న ఆయుధం :

 

సిపిఎం పార్టీ సిద్దిపేట జిల్లా మూడో మహాసభలు డిసెంబర్ 1 2 తేదీల్లో గజ్వేల్ పట్టణంలో నిర్వహించనున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్కా రాములు అన్నారు. గజ్వేల్ పట్టణంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసిన ఆహ్వాన సంఘం సమావేశంలో ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ ఎర్రజెండా దేశవ్యాప్తంగా భూ ఉద్యమాలు రైతాంగ పోరాటాలు కార్మిక పోరాటాల నిర్వహించిందని తెలిపారు వీర తెలంగాణ విప్లవ స్థాయిలో పోరాటం తెలంగాణ లో నిర్వహించిందని కేరళలో ఉన్న ప్రవాయిలార్ పోరాటం బెంగాల్లో తెబాగ పోరాటం నిర్వహించి లక్షలాది ఎకరాల భూములను పేదలకు పంచి పెట్టిందని అన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ద్వారా 10 లక్షల ఎకరాల భూమి పంచడం జరిగిందని వెట్టి చాకిరి విముక్తి కావడం జరిగిందని అన్నారు. అంతర్జాతీయంగా సోషలిస్టు రష్యా ఉన్న రోజులు అమెరికా కన్నా మెరుగైన వసతులు కల్పించిందని ప్రత్యామ్నాయంగా ఉన్నదని నేడు అమెరికాకు దీటుగా చైనా రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందని అన్నారు. ఫ్రాన్స్ లో కమ్యూనిస్టు బలం పెరిగిందని శ్రీలంకలో మార్క్సిస్ట్ మేధావి అధ్యక్షుడయ్యారని అన్నారు. అనేక దేశాల్లో కమ్యూనిస్టు పార్టీ బలంగా విస్తరిస్తుందని అన్నారు దేశంలో అన్ని రాష్ట్రాల్లో సిపిఎం పార్టీ బలంగా ఉందని ప్రజా ఉద్యమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. దేశంలో జరిగిన రైతాంగం పోరాటం కు వెన్నుదన్నుగా సిపిఎం నిలబడిందని పోరాట ఫలితంగా రైతు వ్యతిరేక చట్టాలు వెనక్కు తీసుకోవడం జరిగిందని ప్రజలకు క్షమాపణ చెప్పారని అన్నారు. అన్నారు. కార్మిక సమ్మెలు పోరాటాలు నిర్వహిస్తూ కార్మిక వర్గం కు రక్షణగా నిలబడిందని తెలిపారు. ప్రభుత్వ రంగం రక్షణ కోసం ప్రైవేటీకరణ వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించిందని కార్మికుల ఉద్యోగులకు రైతులకు వ్యవసాయ కార్మికులకు అండగా ఎర్రజెండా నిలబడిందని తెలిపారు. సిద్దిపేట జిల్లాలో మల్లన్న సాగర్ ముంపు బాధితుల కోసం యాత్రలు నిర్వహించి గ్రామసభలు పెట్టిందని అన్నారు సిపిఎం పోరాట ఫలితంగా ప్యాకేజీలు పెరిగాయని అన్నారు. ఆనాడు మల్లన్న సాగర్ ముంపు బాధితులపై అప్పటి ప్రభుత్వం కాల్పులు జరిగిందని అన్నారు. కార్మికులందరికీ కనీస వేతనాలు అమలు చేయాలని వేతనాలు పెంచాలని చట్టపరమైన సౌకర్యాలు అమలు చేయాలని సిపిఎం ఉద్యమించిందని తెలిపారు. ధరణి సమస్యలపై ఉపాధి హామీ కార్మికుల వేతనాలు పెంపుదల కోసం బకాయి పైన వేతనాలు ఇవ్వాలని ఉద్యమించిందని అన్నారు. హమాలీ భవన నిర్మాణం గ్రామపంచాయతీ కార్మికుల ట్రాన్స్పోర్ట్ కార్మికుల రక్షణ కోసం సమగ్ర భీమా చట్టం అమలు చేయాలని ఉద్యమించింది అని తెలిపారు. ఎర్రజెండా అంటే కార్మికుల జెండా అని పేదలకు అండ అని భూమి కోసం ఇళ్ల స్థలాల కోసం ఉద్యమించిందని వేలాది కేసులు నమోదు అయ్యాయని జైల్లోకి వెళ్లడం జరిగిందని తెలిపారు సిపిఎం పార్టీ మూడో మహాసభలకు రైతాంగం కార్మికులు ప్రజలు ఆదరించాలని పోరాటాలను బలపరచాలని పిలుపునిచ్చారు. సిపిఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి మాట్లాడుతూ మహాసభలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సందబోయిన ఎల్లయ్య అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్య కార్యదర్శి వర్గ సభ్యులు గోపాలస్వామి, శశిధర్, భాస్కర్, సత్తిరెడ్డి , జిల్లా కమిటీ సభ్యులు శారద, మావో, రవి, యాదగిరి, శిరీష, కృష్ణారెడ్డి, సిపిఎం గజ్వేల్ నాయకులు రంగారెడ్డి, బండ్ల స్వామి, వెంకట చారి, కనుకయ్య, మహేందర్ రెడ్డి, ప్రవీణ్ , స్వామి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now