Headlines :
-
“సిపిఎం జమ్మికుంట మండల కార్యదర్శిగా శీలం అశోక్ ఏకగ్రీవ ఎన్నిక”
-
“ప్రజా సమస్యలపై ఐక్య ఉద్యమాలకు సిపిఎం సిద్ధం”
-
“కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఎం పోరాటాలు”
*జమ్మికుంట అక్టోబర్ 30 ప్రశ్న ఆయుధం:-*
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) సిపిఎం జమ్మికుంట మండల కార్యదర్శిగా మోత్కుల గూడెం గ్రామానికి చెందిన శీలం అశోక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కమిటీ సభ్యులుగా బాసిర సంపత్ రావు, జక్కుల రమేష్, యాదవ్, రావుల ఓదెలు, దండిగారి సతీష్, వడ్లూరి కిషోర్, గడ్డం శోభన్, బైరం సమ్మయ్య, కన్నం సదానందం, చల్ల కుమార్, క్రాంతి, రామస్వామి, జి రాజకుమారి, దాసరి మొగిలిలతో పాటు మరో ఇద్దరిని కో ఆప్షన్ సభ్యులుగా మహాసభలో ప్రతినిధులు ఎన్నుకున్నారు ఈ సందర్భంగా శీలం అశోక్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో మండల కార్యదర్శిగా ఎన్నుకున్న పార్టీ ప్రతినిధులకు, నాయకులకు విప్లవ జేజేలు తెలియజేశారు.
రాబోయే కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఐక్య ఉద్యమాలు నిర్మించి హక్కులు సాధించుకుంటామని అన్నారు. మండలంలోని ప్రజా సమస్యలను గుర్తించి సమరశీల పోరాటాలు నిర్వహిస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేసేంతవరకు ఉద్యమాలు పోరాటాలు కొనసాగిస్తామని మహాసభలో పలు తీర్మానాలు చేశారు.