సిపిఎం పార్టీ సిద్దిపేట జిల్లా మూడో మహాసభలు జయప్రదం చేయండి 

సిపిఎం పార్టీ సిద్దిపేట జిల్లా మూడో మహాసభలు జయప్రదం చేయండి

డిసెంబర్ 1న హాజరుకానున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మాజీ ఎం పి తమ్మినేని వీరభద్రం 

సిపిఐ ఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి 

గజ్వేల్ నవంబర్ 29 ప్రశ్న ఆయుధం :

 భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు )సిపిఐ ఎం పార్టీ సిద్దిపేట జిల్లా మూడో మహాసభలు గజ్వేల్ పట్టణంలో డిసెంబరు 1,2 తేదీలలో నిర్వహిస్తున్నట్లు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి తెలిపారు.స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా మహాసభలు డిసెంబర్ 1,2 తేదీలలో గజ్వేల్ పట్టణంలో కోలా అభిరామ్ గార్డెన్ లో తెలిపారు 1 తేదీన ఆంధ్ర బ్యాంకు బ్రిడ్జి వద్ద నుండి కోలాభిరామ్ గార్డెన్ వరకు భారీ ర్యాలీ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మహాసభల్లో సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాజీ ఎంపీ తమ్మినేని వీరభద్రం,కేంద్ర కమిటీ సభ్యులు నాగయ్య, సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు, సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్కా రాములు పాల్గొంటున్నారని అన్నారు ఈ మహాసభల్లో జిల్లాలో ఉన్నటువంటి సమస్యలపై తీర్మానం పెట్టి చర్చించడం జరుగుతుందని భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని అన్నారు. గతంలో సిపిఎం పార్టీ కార్మికులు రైతులు ఉద్యోగులు విద్యార్థులు యువజన మహిళల సమస్యలపై నిరంతరం పోరాడుతుందని తెలిపారు. గత మూడు సంవత్సరాలుగా సిద్దిపేట జిల్లాలో నిర్వహించిన పోరాటాలను ఆందోళనను సమీక్షించుకొని భవిష్యత్తు కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని అన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేసిందని, రైతులకు వ్యతిరేకంగా చట్టాలు రూపొందిస్తే సంయుక్త కిసాన్ సభ ఆధ్వర్యంలో చేసిన పోరాటం ఫలితంగా వాటిని రద్దు చేయడం జరిగిందని అన్నారు. కార్మికుల వేతనాలు పెంచాలని, భూ సమస్యలు పరిష్కరించాలని, ధరణి రద్దు చేయాలని డబల్ బెడ్ రూమ్ ఇవ్వాలని అనేక రూపాలలో సిపిఎం పార్టీ జిల్లాల ఉద్యమాలు నిర్వహించిందని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలు ఇవ్వడం జరిగిందని వాటన్నిటినీ అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహాలక్ష్మి పథకాలను అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ సిద్దిపేట జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాళ్ల బండి శశిధర్, సందబోయిన ఎల్లయ్య, మండల కార్యదర్శి సందిటి రంగారెడ్డి, నాయకులు ప్రవీణ్, ఐలయ్య పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment