Site icon PRASHNA AYUDHAM

అడోబ్ ఆర్ అండ్ డి కేంద్రాన్ని ఏర్పాటు చేయండి

ఆంధ్రప్రదేశ్ లో అడోబ్ ఆర్ అండ్ డి కేంద్రాన్ని ఏర్పాటు చేయండి

స్మార్ట్ గవర్నెన్స్, ఎఐ-డ్రైవెన్ సొల్యూషన్స్‌లో భాగస్వామ్యం వహించండి!

యువతలో డిజిటల్ నైపుణ్యాల మెరుగుదలకు సహకారం అందించండి

అడోబ్ సిఇఓతో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ భేటీ

రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టేందుకు రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అమెరికా టూర్ అవిశ్రాంతంగా కొనసాగుతోంది. తాజాగా శాన్ ఫ్రాన్సిస్కోలో అడోబ్ సిఇఓ శంతను నారాయణ్ తో భేటీ అయిన లోకేష్… ఏపీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ప్రగతిశీల ప్రభుత్వం ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలతో ముందుకు సాగుతోంది, ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు పెట్టుబడులకు అన్నివిధాల అనుకూలమైన ప్రాంతమని చెప్పారు

 

మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… ఇన్నోవేషన్ అండ్ గ్రోత్ విజన్ తో మీరు చేస్తున్న కృషి ఆంధ్రప్రదేశ్ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ విజన్‌తో సరిపోతుంది. డిజిటల్ ఫ్లాట్ ఫాంల ద్వారా సృజనాత్మక, వ్యాపార సాధనాల్లో అడోబ్ సేవలు ప్రశంసనీయం. ఎపిలో ఇ-గవర్నెన్స్‌ని సమగ్రపర్చడం, గ్లోబల్ టెక్ హబ్‌గా మార్చడానికి మీవంతు సహకారం అందించండి. ఎఐ వినియోగం ద్వారా ప్రజలకు వేగవంతమైన, మెరుగైన సేవలు అందించేందుకు కృషిచేస్తున్నాం. డిజిటల్ విద్యా ప్లాట్‌ఫారమ్‌లలో ఎఐ ఆధారిత పరిష్కారాలను ఏకీకృతం చేయడంలో మీ భాగస్వామ్యాన్ని కోరుతున్నాం. ఎపిలో అడోబ్ ఆర్ అండ్ డి కేంద్రాన్ని ఏర్పాటు చేయండి. ఆంధ్రప్రదేశ్ లో యువతను డిజిటల్ నైపుణ్యాలతో శక్తివంతం చేయాలనే కృతనిశ్చయంతో ఉన్నాం. డిజిటల్ ఎడ్యుకేషన్ ను మెరుగుపర్చడంలో భాగంగా డిజిటల్ ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫారమ్‌లను రాష్ట్రానికి తీసుకురావడానికి అడోబ్ తరపున సహకారం అందించండి. డాక్యుమెంట్ ప్రొడక్టివిటీ, ఎఐ పవర్డ్ టూల్స్‌లో అడోబ్ నైపుణ్యం మాకు ఎంతగానో ఉపకరిస్తుంది.

 

డాక్యుమెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్, పబ్లిక్ సర్వీస్‌లను క్రమబద్ధీకరించడం, ప్రభుత్వ ప్రక్రియలను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి, స్మార్ట్ గవర్నెన్స్, ఎఐ-డ్రైవెన్ సొల్యూషన్స్‌ అమలులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలసి పనిచేయండి. ప్రభుత్వం, పరిశ్రమల వినియోగానికి సంబంధించి క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి, ప్రభుత్వ కార్యకలాపాలు, పౌరసేవల్లో క్లౌడ్ ఇంటిగ్రేషన్‌ కు అడోబ్ భాగస్వామ్యం వహించే అంశాన్ని పరిశీలించండి. ప్రభుత్వ సేవలు, స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్‌ల్లో అడోబ్ ఎఐ ఆధారిత సేవలు, సృజనాత్మకత, డిజిటల్ అనుభవం ఆంధ్రప్రదేశ్ కు ఉపయోగపడతాయి. పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, స్టార్టప్‌లకు అడోబ్ యొక్క సృజనాత్మక సాధనాలు ఆంధ్రప్రదేశ్‌ సమగ్రాభివృద్ధికి దోహదపడతాయి, ఎపి ప్రభుత్వంతో కలసి పనిచేయాలని లోకేష్ కోరారు. మంత్రి చేసిన ప్రతిపాదనలపై శంతన్ నారాయణ్ స్పందిస్తూ… కంపెనీలోని సహచరులతో చర్చించి ఎపిలో పెట్టుబడులు పెట్టే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు.

Exit mobile version