*స్కూల్ ట్వినింగ్ ప్రోగ్రాంతో పిల్లలకు క్రియేటివిటీ పెరుగుతుంది*
*మండల విద్యాధికారి హేమలత*
*జమ్మికుంట ఏప్రిల్ 21 ప్రశ్న ఆయుధం*

జిల్లా జమ్మికుంట మండలంలోని ఐదు ప్రాథమికోన్నత పాఠశాలల స్కూల్ ట్వినింగ్ ప్రోగ్రాంను సోమవారం రోజున జమ్మికుంట లోని గర్ల్స్ హై స్కూల్ నందు ఏర్పాటుచేసి నిర్వహించారు ఈ ప్రోగ్రాం లో జమ్మికుంట మండలంలోని యుపిఎస్ మాచనపల్లి, ధర్మారం, శాయంపేట, సైదాబాద్ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు పాల్గొని పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థుల సాంస్కృతిక, ప్రదర్శనలు ఉపన్యాసాలు, ఏకపత్రాభినయాలు, పాటల పోటీలు , ఆటల పోటీలు నిర్వహించారు అనంతరం విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి హేమలత పాల్గొని మాట్లాడుతూ ఈ ప్రోగ్రాం వలన పిల్లలు దాగి ఉన్న సృజనాత్మకత వ్యక్తం అవుతుందని పాఠశాలల మధ్య ఇలాంటి స్కూల్ ట్విన్నింగ్ ప్రోగ్రాం ఒక చక్కటి వినూత్న కార్యక్రమం అని ఈ విధంగా అన్ని పాఠశాలలు ఒకచోట చేరి వారి పాఠశాలలో చేపడుతున్న వినూత్న కార్యక్రమాల గురించి పరస్పరం పంచుకోవడం ద్వారా అన్ని పాఠశాలలో మంచి విద్యాబోధన జరుగుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక గర్ల్స్ హై స్కూల్ హెచ్ఎం హెచ్ఎం సుధాకర్ ఇతర పాఠశాల ప్రధానోపాధ్యాయులు వేణుమాధవ్, లింగయ్య ,సుచరిత తిరుపతి ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.
Post Views: 16