రైతు ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు జమ

*రైతు ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు జమ*

హైదరాబాద్:జనవరి 27

రైతుల ఖాతా లో రైతు భరోసా జమ చేసే ప్రక్రియ కొనసాగుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. తొలివిడతలో మండలానికి ఒక గ్రామంలో రైతు భరోసా సొమ్ము విడుదల చేస్తున్నట్టు చెప్పారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 4,41,911 మంది రైతుల ఖాతాలో రైతు భరోసా డబ్బులు జమ చేసినట్లు తెలిపారు.

తెలంగాణలో రైతులకు పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం అందజేస్తున్న ఏడాదికి ఎకారానికి రూ.10 వేల నుంచి రూ. 12 వేలకు పెంచిన ఆర్థిక సహయం రైతుల ఖాతాల్లో జమ అవుతున్నది.

రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 606 గ్రామాల్లో ఇవాళ్టి నుంచి రైతుల ఖాతాల్లో నిధులను జమ చేయడం ప్రారంభించింది. రూ.570 కోట్ల నగదును రైతుల ఖాతాల్లో జమ చేసింది. దీంతో రైతుభరోసా సాయం కోసం ఎదురు చూస్తున్న రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Join WhatsApp

Join Now