Site icon PRASHNA AYUDHAM

కామారెడ్డి జిల్లాలో తగ్గిన నేరాలు, కేసులు: జిల్లా ఎస్పీ ఎం రాజేశ్ చంద్ర ఐపీఎస్ 

Galleryit 20251224 1766593996

కామారెడ్డి జిల్లాలో తగ్గిన నేరాలు, కేసులు: జిల్లా ఎస్పీ ఎం రాజేశ్ చంద్ర ఐపీఎస్

 

2025 గణాంకాలలో తగిన నేరాల సంఖ్య

 

శాంతిభద్రతలు కాపాడే బాటలో పోలీస్ శాఖ

 

ప్రశ్న ఆయుధం

 

కామారెడ్డి జిల్లా ఇంచార్జ్ డిసెంబర్ 24

 

కామారెడ్డి జిల్లా పరిధిలో 2025 సంవత్సరం పూర్తయ్యే లోపు నేరల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు జిల్లా ఎస్పీ ఎం రాజేష్ చంద్ర ఐపీఎస్ మీడియా సమావేశంలో తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం రోజున క్రైమ్ యాన్యువల్ బుక్ లేట్ విడుదల చేశారు. 2024 ,2025 సంవత్సరాల్లో ఆస్తి సంబంధించిన నేరాల్లో 698, హత్యలు 34, కిడ్నాప్లు 43, రేప్ కేసులు 67, రోడ్డు ప్రమాదాల కేసులు 470, ఇతరత్రా కేసులు 1315,550 లోకల్ స్పెషల్ చట్టాల కేసులు, మిస్సింగ్ కేసులు 492 జిల్లాలో నమోదైనట్లు ఎస్పీ తెలిపారు. గత సంవత్సరం కంటే కేసుల నమోదు సంఖ్య ఈ సంవత్సరం తగ్గినట్లు వివరించారు. నమోదైన ఈ కేసులలో నిందలందర్నీ అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. మహిళలపై జరిగే నేరాల సంఖ్య కూడా తగ్గాయని తెలిపారు. జిల్లా పరిధిలోని డిఎస్పి కార్యాలయంలో ఫ్యామిలీ కౌన్సిలింగ్ ద్వారా అనేక సమస్యల పరిష్కరించే దిశగా పోలీస్ శాఖ పనిచేస్తున్నదని అన్నారు. అలాగే రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా భద్రత చర్యలు కట్టుదిట్టమైన నిబంధనలు అమలు చేస్తూ గడిచిన సంవత్సర కాలంలో రోడ్డు ప్రమాదాలు మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గినట్లు జిల్లా ఎస్పీ వివరించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్, వాహన తనిఖీలు, హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్ లేనివారిని, వాహనాలు అతివేగంగా ప్రయాణించే వారిని గుర్తించి చలానలు వేసి, హాట్ స్పాట్స్ వద్ద చర్యలు తీసుకొని ప్రజలకు తమ విలువైన ప్రాణాలను కాపాడు కోవడంలో పోలీస్ శాఖ అనేక కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పిస్తున్నామన్నారు. సంవత్సర కాలంలో 23 ఎన్డీపీస్/గంజాయి, నిషేధిత మొత్తం పదార్థాలు కలిగిన, అమ్మిన ,రవాణా చేసిన వారిపై చట్టరీత్యా కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. సుమారుగా రూ.8,59,750 విలువగల 6.67 కిలోల గంజాయి నిషేధిత మత్తు పదార్థాలు, 43 గంజాయి సాగు మొక్కలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసుల్లో నిందితులకు కఠిన శిక్షలు విధించామని తెలిపారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అంతర్రాష్ట్ర నకిలీ కరెన్సీ రాకెట్ను చేదించేందుకు దేశవ్యాప్తంగా విస్తరించిన ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. బెంగళూరు మండలం అంతంపల్లి తాళ్లమర్ల గ్రామ శివారులో జరిగిన రాబడి దొంగతనాల కంజర్ బాట్ అంతా రాష్ట్ర దొంగల ముఠా అయిదుగురు అరెస్టు చేసి వారి నుంచి రూ.15.45 లక్షల విలువైన మొబైల్ ఫోన్లు ,ఆస్తి ,వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తాడ్వాయి గాంధారి లింగంపేట్ రాజంపేట బాన్సువాడ పరిధిలోని ఇళ్లలో దోపిడి చేసి ప్రజల భద్రతలకు భంగం కలిగించిన గడ్డపార గ్యాంగ్ ఐదుగురు నిందితులను చాకచక్యంగా అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని తెలిపారు. సోషల్ మీడియా యాప్ల ద్వారా అమాయకులను మోసం చేసే దిశగా బెదిరించి డబ్బులు వసూలు చేస్తూ దొరికిన ఐదుగురు ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ఈ ముఠా సభ్యులు కామారెడ్డి, సిద్దిపేట ,ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో 9 నేరాలు చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుండి రూ.96,350 నగదు, 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రాబోయే 2026 సంవత్సరంలో మరిన్ని ఆర్థిక నేరాలు జరగకుండా అనేక జాగ్రత్తలు చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ ఎం రాజేష్ చంద్ర ఐపీఎస్ అన్నారు. ఈ సమావేశంలో ఏ ఎస్ పి, అదనపు ఎస్పి, పోలీస్ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.

Exit mobile version