సీసీ కెమెరాలు ఏర్పాటుతో నేరాల నియంత్రణ…

నేను సైతం లో ప్రజలను భాగస్వామ్యం చేయాలి

సీసీ కెమెరాలు ఏర్పాటుతో నేరాల నియంత్రణ…

జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి…

మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం డిసెంబర్19

వెల్దుర్తి, మన తెలంగాణ. గ్రామాలలో ప్రజల భాగస్వామ్యంతో సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా నేరాలు నియంత్రించడంతోపాటు చోరీలను అరికట్టవచ్చని జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు గురువారం వెల్దుర్తి పోలీస్ స్టేషన్ ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతో గ్రామాలలో సీసీ కెమెరాల ఏర్పాటుకు నేను సైతం అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో గ్రామాలలోని బ్యాంకులు ఫంక్షన్ హాల్లో హోటలు లాభాలు ప్రైవేట్ ఫైనాన్స్లో వైన్సులు దుకాణాల వద్ద సిసి కెమెరాలు లోపలే కాకుండా బయట కూడా ఏర్పాటు చేయాలని దీని ద్వారా చోరీలను అరికట్టవచ్చని ఎస్పి అన్నారు. అక్రమంగా ఇసుక మట్టిని గ్రామాల శివారులలో డబ్బులు చేసి తిప్పలు లారీల ద్వారా బయట ప్రాంతాలకు తరలిస్తే వారిపై కేసు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు గ్రామాలలో డ్రగ్స్ గంజాయి ఇతర పదార్థాల వాడకంపై పోలీసులకు ప్రజలు సమాచారం ఇవ్వాలని మత్తుకు బానిసైన వారికి కౌన్సెలింగ్ నిర్వహించడం పాట విక్రయించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పి అన్నారు ఎస్పీ వెంట తూప్రాన్ డిఎస్పి వెంకటరెడ్డి సిఐ రంగి కృష్ణ తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now