చిత్తూరు జిల్లా వి.కోట మండల కేంద్రంలో ‘ఆంధ్రజ్యోతి’, ‘ఏబీఎన్- ఆంధ్రజ్యోతి’ విలేకరి వారణాసి జగన్మోహన్రెడ్డి (49) ను రౌడీషీటర్ మహబూబ్ బాషా ఎలియాస్ తమీమ్ కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
విలేకరి జగన్మోహన్రెడ్డిని ధన్నూపురంలో మహబూబ్ బాషా అడ్డగించి, దాడికి పాల్పడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. జగన్మోహన్రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. నిందితుడు మహబూబ్ బాషా కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
హత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. జగన్మోహన్రెడ్డికి ఎవరితోనైనా వివాదాలు ఉన్నాయా అనే కోణంలో ఆరా తీస్తున్నారు.
ఈ హత్యోదంతంపై పలువురు పాత్రికేయ సంఘాలు, స్థానిక ప్రజలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నిందితుడిని తక్షణమే పట్టుకుని చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.











