హైదరాబాద్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ పోస్టర్ను ఒక యువకుడు చింపిన ఘటన పోలీసుల అదుపులోకి తీసుకునే వరకు దారితీసింది. ఈ సంఘటనపై స్థానికంగా వందలాది మంది నిరసన తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నగరంలో ఖమేనీ పోస్టర్ను ఒక యువకుడు చింపడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.
అయితే, ఈ చర్యకు నిరసనగా వందలాది మంది స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని, ఆ యువకుడి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ పరిణామంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా, ఇజ్రాయెల్ జెండాలను కాల్చినా, వారి నాయకుల పోస్టర్లను ధ్వంసం చేసినా పెద్దగా స్పందన రాని నేపథ్యంలో, ఖమేనీ పోస్టర్ను చించడంపై ఇంతటి వివాదం చెలరేగడం చర్చనీయాంశంగా మారింది.
పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకుని, యువకుడిపై విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

