లింగంపేట బస్టాండ్లో దొంగతనాలు, వేసవిలో సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో కళాబృందం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది.
కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు, లింగంపేట ఎస్ఐ పి. దీపక్ సూచనల మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు. సైబర్ నేరాల నివారణకు టోల్ ఫ్రీ నంబర్ 1930, అత్యవసరాలకు 100, షీ టీమ్స్ నంబర్ 8712686094 లను ఉపయోగించాలని సూచించారు.
సోషల్ మీడియా వాడకంలో జాగ్రత్తలు, ఇంటి తాళం వెంట తీసుకెళ్లడం, ఆభరణాల విషయంలో అప్రమత్తత వంటి అంశాలపై అవగాహన కల్పించారు.
పోలీస్ కళాబృందం ఇన్చార్జి రామంచ తిరుపతి, హెడ్ కానిస్టేబుల్ యు. శేషారావు, కానిస్టేబుల్ సాయిలులు పాటలు, మాటల ద్వారా ఈ సందేశాన్ని ప్రజలకు అందించారు.


