కూకట్ పల్లిలో ప్రేమించి, పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్న కార్తీక్, మంజుల అనే నవదంపతులు పెళ్లైన నెల రోజులు కూడా గడవక ముందే ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. ఒకరు ఉరేసుకొని, మరొకరు విషం సేవించి బలవన్మరణానికి పాల్పడ్డారు.
మార్చి 8వ తేదీన వివాహ బంధంతో ఒక్కటైన ఈ జంట, కొద్దిరోజుల్లోనే జీవితాన్ని అంతం చేసుకోవడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. వీరి ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
స్థానికంగా ఈ వార్త తెలిసి అందరూ షాక్ అయ్యారు. పెళ్లైన కొద్ది రోజులకే ఇలా జరగడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాలను పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.
ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కుటుంబ సభ్యులు, బంధువుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.










