హత్య చేసి బంగారం గొలుసు దొంగతనం చేసిన నేరస్తులు అరెస్ట్

హత్య చేసి బంగారం గొలుసు దొంగతనం చేసిన నేరస్తులను అరెస్టు చేసాం

– కామారెడ్డి డి.ఎస్.పి నాగేశ్వరరావు

బిక్నూర్ మండలం కంచర్ల గ్రామ శివారులో గల తమ వ్యవసాయ భూమిలో ఈనెల 20 న పనిచేస్తున్న బల్లెముల సుగుణ ( 56 )ను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి ఆమె మెడలో నుండి మూడు తులాల బంగారు గొలుసును దొంగలించినట్లు మృతురాలి కుమారుడు బాలేముల రాజు ఫిర్యాదు మేరకు బిక్నూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగిందని కామారెడ్డి డిఎస్పి నాగేశ్వరరావు అన్నారు. సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని డిఎస్పి కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డిఎస్పి నాగేశ్వరరావు మాట్లాడుతూ దర్యాప్తులో భాగంగా కంచర్ల గ్రామంలోని సిసి ఫుటేజ్ లను సంఘటన జరిగిన సమయానికి అటు ఇటుగా పరిశీలించి దాని ఆధారంగానే నిందితులను గుర్తించి పట్టుకోవడం జరిగిందన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన దండగుల నవీన్, అల్లెపు ప్రసాద్, అల్లెపు సాలవలను సోమవారం అరెస్టు చేసి వారి నుండి దొంగలించిన సొత్తు మూడు తులాల బంగారం పుస్తెలతాడును, హత్యకు ఉపయోగించిన రాడును, బైకును, ఇతర సాక్షాలను వారి నుంచి సేకరించడం జరిగిందఎన్నారు. ఈ నలుగురు నిందితులు కూడా కామారెడ్డి జిల్లాలోని బిబిపేట మండలం యాడవరం గ్రామానికి చెందిన వారన్నారు. గతంలో వీరిపై ఇదే విధమైన కేసులు సిరిసిల్ల, సిద్దిపేట్ హుస్నాబాద్ పలు పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయి ఉన్నాయన్నారు.ఈ కేసుతో సంబంధమున్న నలుగురు వ్యక్తులు పాత నేరస్తులేనని ఒక్కొక్కరిపై 24, 14, 8 వరకు కేసులు ఉన్నాయన్నారు. ఇందులో ప్రధాన నిందితుడైన దండుగుల నవీన్ పైన ఇప్పటివరకు ఐదు హత్య కేసులు, 9 దొంగతనం కేసులు మొత్తంగా 14 కేసులు ఉన్నాయని, రెండవ నిందితుడైన అల్లెపు మల్లయ్య పై 24 కేసులు ఉన్నాయన్నారు. ఆల్లెపు మల్లయ్య భార్య సాలవ్వ ఇద్దరిపై కలిసి ఎనిమిది కేసుల వరకు ఉన్నాయన్నారు. నిందితులు పథకం ప్రకారం మహిళను హత్య చేసి ఆమె మెడలో నుండి బంగారం పుస్తెలతాడును దొంగతనం చేసిన నేరంలో తదుపరి దర్యాప్తు కొనసాగుతుందన్నారు. ఈ హత్య, దొంగతనం కేసును ఛేదించిన భిక్నూర్ సీఐ ఎం సంపత్ కుమార్, కామారెడ్డి సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీనివాస్, సిసిఎస్ సిబ్బంది, బిక్నూర్ ఎస్సై సాయికుమార్, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ రెడ్డి, కానిస్టేబుల్ సైదయ్య, రాజా గౌడ్, గడ్డం నరేష్ కుమార్, శ్రవణ్ కుమార్ లను జిల్లా ఎస్పీ ఈ కేసులో వీరిని అభినందించడం జరిగిందని ఆయన తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment