అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణలో బండి రమేష్ పై వస్తున్న విమర్శలు న్యాయ సమ్మతమేమీ కావు : దళిత రత్న వార బాబ్జి కుమార్
ప్రశ్న ఆయుధం ఏప్రిల్ 16: కూకట్‌పల్లి ప్రతినిధి
అంబేద్కర్ అభిమానులకు దళిత సంఘ నాయకులకు నమస్కారాలు.
కూకట్పల్లి కె.పి.హెచ్.బి ఫోర్త్ ఫేస్ ప్రాంతంలో, ఏషియా ఖండంలో అతిపెద్ద కాలనీగా పేరుగాంచిన ఈ ప్రాంతంలో, నా ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది.
దళిత రత్న అవార్డు గ్రహీతగా, అంబేద్కర్ ఆశయాలపై నిబద్ధత కలిగిన వ్యక్తిగా, ఈ సందర్భంగా కొన్ని విషయాలు స్పష్టంగా తెలియజేయదలిచాను.
కూకట్పల్లి నియోజకవర్గంలో బండి రమేష్ ఎంతోకాలంగా అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లో విస్తరించేందుకు శ్రమిస్తున్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోనూ ఆయన విగ్రహాల ఏర్పాటు కోసం కృషి చేసిన త్యాగాన్ని గుర్తించాలి.
ఇటీవల బండి రమేష్ అంబేద్కర్ ని అవమానించారని కొన్ని వర్గాలు ఆరోపించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.
ప్రతి విషయంలోను అంబేద్కర్ అభిమానులను చీల్చేలా కుట్రపూరితంగా వ్యవహరించడం మనం గుర్తించాల్సిన విషయం. బండి రమేష్ పాత్రను విమర్శించడం అన్యాయమని ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాను.
కూకట్పల్లి నియోజకవర్గంలో బండి రమేష్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేస్తున్న వ్యక్తి. అటువంటి వ్యక్తి అంబేద్కర్ ని అవమానించారు అంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే మన హక్కులు, స్వేచ్ఛ, స్వతంత్రం,రాజ్యాంగ పరిరక్షణ కోసం మండుటెండలో బండి రమేష్ చేస్తున్న కృషి అభినందనీయం.అంబేద్కర్ విధానాలను, ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి బండి రమేష్ .
కూకట్పల్లి అంబేద్కర్ అభిమానులను, దళిత నాయకులను వివరణ కోరగా, వారు అన్నది ఏమిటంటే బండి రమేష్ ఊరేగింపుగా వెళ్లారని ప్రచారం చేస్తున్నారు, అది వాస్తవం కాదు. మన దళిత సంఘ నాయకులు వారిని కూర్చోమన్నారు. పైగా వారు తెలియజేసింది ఏమిటంటే వెనక పక్క ఫోటో ఉన్న విషయాన్ని బండి రమేష్ గుర్తించలేదు. ఫోటో ఉన్న విషయాన్ని తెలియజేయగా పక్కకు జరిగి ఆ చిత్రపటానికి గౌరవించి పక్కకు జరగటం జరిగింది. ఇంతగా మన అంబేద్కర్ ని అభిమానించే బండి రమేష్ పై నిందించటం తగదు. ప్రతిసారి కించపరచడం మనకు తగదు అని దళిత రత్న వార బాబ్జి కుమార్ అన్నారు.