కామారెడ్డిలో మోదీ పాలనపై ప్రచారం… కాంగ్రెస్ వైఫల్యాలపై విమర్శలు

బీజేపీ మహాసంపర్క్ అభియాన్ – ప్రజల్లో అవగాహన జోరుగా

కామారెడ్డిలో మోదీ పాలనపై ప్రచారం, కాంగ్రెస్ వైఫల్యాలపై విమర్శలు

ప్రధాని మోదీ పాలనలో అభివృద్ధిని కరపత్రాల ద్వారా వివరించిన బీజేపీ

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను నెరవేర్చలేదని తీవ్ర విమర్శ

కేంద్ర నిధులతోనే రాష్ట్ర పథకాలు కొనసాగుతున్నాయన్న బీజేపీ నేతలు

స్థానిక సంస్థల ఎన్నికలు లేకపోవడమే నిధుల జాప్యానికి కారణమని ఆరోపణ

మద్దతుదారుల నుంచి మిస్ కాల్ ద్వారా బీజేపీకి మద్దతు కోరిన పట్టణ అధ్యక్షుడు

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జరుగుతున్న *”మహాసంపర్క్ అభియాన్”*లో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీజేపీ నేతలు ప్రగతిని ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా పట్టణ బీజేపీ అధ్యక్షుడు మోటూరి శ్రీకాంత్ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశం అభివృద్ధి మార్గంలో దూసుకెళుతోందని, రాష్ట్రంలో జరుగుతున్న అనేక పథకాలకు కేంద్రమే నిధుల యజమాని అని స్పష్టం చేశారు.

ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రధాన మంత్రి ఆవాస యోజన ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా కేంద్రం డబ్బులు జమ చేస్తోందని చెప్పారు. అదే విధంగా ఉపాధి హామీ పథకానికి కూడా కేంద్ర నిధులే మూలాధారం అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల సర్పంచ్‌లు, మున్సిపాలిటీలకు నిధులు నేరుగా రాలేకపోతున్నాయని ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ ఎన్నికల్ని వాయిదా వేస్తున్నారని విమర్శించారు.

కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ప్రజల సమస్యలపై నిరంతరం స్పందిస్తూ పని చేస్తున్నారని, నియోజకవర్గం ప్రశాంతంగా ఉందని గుర్తు చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని, 9240015366 నంబరుకు మిస్ కాల్ ఇవ్వాలని ప్రజలను కోరారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ కుంటా లక్ష్మారెడ్డి, నాయకులు శ్రీనివాస్, వేణు, రజినీకాంత్, లక్ష్మీపతి, రఘు, రాజగోపాల్, భరత్, ధనలక్ష్మి, భూమెష్ తదితరులు పాల్గొన్నారు.

 

 

 

Join WhatsApp

Join Now

Leave a Comment