●అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు
●శాస్త్రుల వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో
●గురు పౌర్ణమి సందర్భంగా భగలాముఖి అమ్మవారికి అభిషేకం విశేష పూజలు
ప్రశ్న ఆయుధం న్యూస్ జులై 21 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)
ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మెదక్ జిల్లా శివ్వంపేట మండల కేంద్రంలో నూతనంగా నిర్మితమైన అత్యంత శక్తివంతమైన పీఠంలో ఒకటైన భగలాముఖి శక్తిపీఠంలో గురు పౌర్ణమి సందర్భంగా బగలాముఖి వ్యవస్థాపక అధ్యక్షులు అమ్మవారు ఉపాసకులు శాస్త్రుల వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో బగలాముఖి ట్రస్ట్ సభ్యుల సహకారంతో భగలాముఖి అమ్మవారికి అభిషేకము విశేష పూజలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించడం జరిగింది ఉదయం నుండే గురు పౌర్ణమి కావడంతో భక్తులతో భగలాముఖి శక్తిపీఠం ప్రాంగణమంతా కిటకిటలాడింది అమ్మవారికి ఉదయం మహా పూజ శ్రీ సూక్త దేవి శుక్త అష్టోత్తర నామాలు సహస్రనామాలు హరిదార్చన అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం మంగళ హారతి మంత్రపుష్పం నిర్వహించి అమ్మవారి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర శర్మ మాట్లాడుతూ నేటి సమాజంలో నేను బాగుండకున్న పరవాలేదు కానీ ఇంకొకరు బాగుండకుంటే బాగుండని చెడు కోరే మన శత్రువులు ఉన్నారని శివ్వంపేట భగలాముఖి అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు వారి శత్రువుల నాలుకలు పట్టుకొని శత్రువు యొక్క చెడు మాటలను మనకు నష్టం కలిగించే మాటలను స్తంభింపజేసి భక్తులకు ఎలాంటి ప్రతి బాధలు కలగకుండా వాటిని తొలగింపజేసే శత్రుకారిని స్తంభ దేవత శ్రీ భగలాముఖి అమ్మవారిని భగలాముఖి వ్యవస్థాపకులు ట్రస్ట్ అధ్యక్షులు బగలాముఖి ఉపాసకులు వెంకటేశ్వర శర్మ అన్నారు అమ్మవారిని దర్శించిన భాగ్యం వల్ల కలిగే మోక్ష ఫలితాలను పుణ్యఫలితాలను భక్తులకు వివరించారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు అనంతరం భగలాముఖి శక్తి పీఠంలో భగలాముఖి వ్యవస్థాపకులు ట్రస్ట్ అధ్యక్షులు బగలాముఖి ఉపాసకులు వెంకటేశ్వర శర్మ ను బి ర్ ఎస్ సీనియర్ నాయకుడు పబ్బా స్వరూప రమేష్ గుప్తా మరియు తాజా మాజీ జడ్పీటీసీ పబ్బా మహేష్ గుప్తా వెంకటేశ్వర శర్మ ను ఘనంగా సన్మానించారు