Site icon PRASHNA AYUDHAM

భగలాముఖి సన్నిధిలో భక్తుల సందడి

79fb2d81 5ebd 41ae 938b e4ea0ca572a4

●అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు

●శాస్త్రుల వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో

●భగలాముఖి అమ్మవారికి అభిషేకం విశేష పూజలు

● కీ.శే. అంజమ్మ పెద్ద గౌని లింగయ్య గౌడ్ జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమం

ప్రశ్న ఆయుధం న్యూస్ అక్టోబర్ 17(మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)

శివ్వంపేట మండల కేంద్రంలో కొలువై వెలసిన భగలాముఖి శక్తిపీఠం అమ్మవారి ప్రీతివంతమైన రోజు పౌర్ణమి కావడంతో దేశ నలుమూలల నుంచి పలు రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున రావడంతో భక్తులతో ఆలయ ప్రాంగణమంతా కిటకి టలాడింది. పౌర్ణమి సందర్భంగా భగలాముఖి శక్తిపీఠం ఆలయంలో ఆలయ ఫౌండర్ చైర్మన్ ఉపాసకులు శాస్త్రుల వెంకటేశ్వర శర్మ వేద పండితుల ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో గల యాగశాలలో ప్రత్యేక యజ్ఞం నిర్వహించి భగలాము ఖి అమ్మవారికి అర్చన మహా మంత్ర హవనం మహా పూజ విశేషపూజలు పంచామృతాలతో అభిషేకం ఆ రిద్రార్చన హవనం, పూర్ణాహుతితో పూజలు ముగిం చారు, వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయానికి వచ్చిన భక్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశామని ఆలయ ట్రస్ట్ సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర శర్మ మాట్లాడుతూ నేటి సమాజంలో నేను బాగుండకున్న పరవాలేదు కానీ ఇంకొకరు బాగుండకుంటే బాగుండని చెడు కోరే మన శత్రువులు ఉన్నారని శివ్వంపేట భగలాముఖి అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు వారి శత్రువుల నాలుకలు పట్టుకొని శత్రువు యొక్క చెడు మాటలను మనకు నష్టం కలిగించే మాటలను స్తంభింపజేసి భక్తులకు ఎలాంటి ప్రతి బాధలు కలగకుండా వాటిని తొలగింపజేసే శత్రుకారిని స్తంభ దేవత శ్రీ భగలాముఖి అమ్మవారిని భగలాముఖి వ్యవస్థాపకులు ట్రస్ట్ అధ్యక్షులు బగలాముఖి ఉపాసకులు వెంకటేశ్వర శర్మ అన్నారు అమ్మవారిని దర్శించిన భాగ్యం వల్ల కలిగే మోక్ష ఫలితాలను పుణ్యఫలితాలను భక్తులకు వివరించారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు

భక్తులకు అన్నదాన కార్యక్రమం

భగలాముఖి ఆలయానికి వచ్చిన భక్తులకు హైకోర్టు సీనియర్ న్యాయవాది పెద్దగోని శివకుమార్ గౌడ్ దంపతుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం పెద్దగోని శివకుమార్ గౌడ్ తల్లిదండ్రులు కీ.శే. అంజమ్మ పెద్ద గౌని లింగయ్య గౌడ్ స్మారకార్థము మహా అన్నప్రసాద వితరణ చేశారు అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Exit mobile version