చితక్కొట్టిన తెలుగు కుర్రాడు.. భారీ స్కోర్ దిశగా టీమిండియా..!!

చితక్కొట్టిన తెలుగు కుర్రాడు.. భారీ స్కోర్ దిశగా టీమిండియా..!!

ఢీల్లీ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా భారీ స్కోర్ దిశగా సాగుతోంది. ముఖ్యంగా తెలుగు కుర్రాడు, సన్ రైజర్స్ ఆటగాడు నితీష్ రెడ్డి(74) వీరవిహారం చేశాడు.

నలుమూలలా బౌండరీలు బాదుతూ బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించాడు. ప్రస్తుతం టీమిండియా స్కోర్.. 152/4 (14 ఓవర్లు ముగిసేసరికి).

 

*తొలి మూడు ఓవర్లలో 2 వికెట్లు*

 

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత జట్టు తొలి మూడు ఓవర్లలోనే 2 కీలక వికెట్లు కోల్పోయింది. శాంసన్(10), అభిషేక్ శర్మ(15) ఇద్దరూ స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరారు. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన నితీష్ రెడ్డి ఆరంభంలో కాస్త తడబడినట్లు కనిపించినా.. అనంతరం బంగ్లా బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. 27 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న నితీష్ రెడ్డి మొత్తంగా 74(34 బంతుల్లో; 4 ఫోర్లు, 7 సిక్స్ లు ) పరుగులు చేశాడు. అతనికి రింకూ సింగ్(35 నాటౌట్; 19 బంతుల్లో) కూడా తోడవ్వడంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది.

Join WhatsApp

Join Now