Headlines
-
“కార్మిక వ్యతిరేక కోడ్‌లను వెంటనే రద్దు చేయాలి”: సీఐటీయూ అధ్యక్షుడు చుక్క రాములు
-
“కార్మికుల హక్కుల రక్షణ కోసం పోరాటం సాగిస్తాం” – సీఐటీయూ
-
“కేంద్రం తెచ్చిన కార్మిక కోడ్లపై చుక్క రాములు తీవ్రమైన విమర్శలు”
-
“మేడ్చల్‌లో కార్మిక సంఘాల ఐక్యత: చుక్క రాములు పిలుపు”
-
“ఎపిరాక్ ఎంప్లాయీస్ యూనియన్ 15వ వార్షికోత్సవం: చుక్క రాములు ముఖ్య వ్యాఖ్యలు”
__సీఐటీయూ మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి జె.చంద్రశేఖర్‌కార్మిక హక్కులను కాలరాస్తే సహించం : సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు
– చర్లపల్లిలో ఎపిరాక్ ఎంప్లాయీస్ యూనియన్ 15వ వార్షికోత్సవం
కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తూ 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్‌లుగా మార్చిందని, వాటిని వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు డిమాండ్ చేశారు. మేడ్చల్ జిల్లా చర్లపల్లి పారిశ్రామికవాడలోని ఎపిరాక్ ఎంప్లాయీస్ యూనియన్ 15వ వార్షికోత్సవంలో సోమవారం ఆయన పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం యూనియన్ ప్రధాన కార్యదర్శి బివి సత్యనారాయణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చుక్కా రాములు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను తెలంగాణ ప్రభుత్వం అమలు చేయొద్దన్నారు. 15 సంవత్సరాలుగా సీఐటీయూ నాయకత్వంలో కార్మికులందరూ ఐకమత్యంతో మెరుగైన వేతన ఒప్పందాలు చేసుకుంటున్నట్టు చెప్పారు. కార్మికుల ప్రయోజనాలు కాపాడుకుంటూ, ఉత్పత్తిలో భాగమవుతూ, యజమాన్యంతో చర్చల ద్వారా సమస్యలను పరిష్కారం చేసుకుంటూ కార్మికుల హక్కులను కాపాడుతూ క్రమశిక్షణతో యూనియన్‌ను నడిపినట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తూ, యజమానులకు అనుకూలంగా కొత్త కోడ్‌లను తీసుకొచ్చిందన్నారు. దీనివల్ల కార్మికుల నిజ వేతనాలు పడిపోతాయని, కార్మికుల సౌకర్యాలు తొలగిస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కార్మిక కోడ్లను అఖిల భారత సమ్మెలతో ఇప్పటివరకు అమలు కాకుండా ఆపగలిగామని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కార్మిక కోడ్లను అమలు చేయడంలో తొందరపడుతున్నదని, దీనిపై ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. లేనిచో భవిష్యత్‌లో సీఐటీయూ అగ్రభాగాన ఉంటూ కార్మికులందరినీ ఐక్యం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలకు పిలుపునిస్తుందని చెప్పారు.
కార్మికులందరూ ఏకం కావాలి
ఇప్పటికీ పర్మినెంట్ కార్మికులను తొలగిస్తూ.. కాంట్రాక్టు, పిక్స్ టర్మ్ ఎంప్లాయీస్, అప్రెంటిస్ అనే పేర్లతో వేతనాలు లేకుండా కార్మికులకు ఎలాంటి చట్టాలూ అమలు కాకుండా చేస్తున్నారని సీఐటీయూ మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి జె.చంద్రశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు అనుకూలంగా కొత్త చట్టాలు తెస్తున్నాయన్నారు. భవిష్యత్‌లో జరిగే పోరాటాల్లో కార్మికులంతా ఐక్యంగా భాగస్వాములు కావాలని కోరారు. కార్మికులు ఐకమత్యంగా ఉండి హక్కులను కాపాడుకోవాలన్నారు. మేడ్చల్ జిల్లాలో కార్మిక వర్గాన్ని ఏకం చేయాలన్నారు. కొద్దిమంది ప్రయోజనాలకే ఈ ప్రభుత్వాలు పని చేస్తున్నాయని చెప్పారు. కావునా భవిష్యత్ పోరాటాల్లో కార్మికులందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా యూనియన్ ఫౌండర్లను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు పి.గణేష్, యూనియన్ ఫౌండర్స్ ఆఫీస్ బేరర్స్ బి.వి.సత్యనారాయణ, నారాయణ, రాముడు, రాంబాబు, భాస్కర్, రఫీ, వి.శ్రీనివాస్, దుర్గాప్రసాద్, నాగార్జున, రాజు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
సీఐటీయూ మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి జె.చంద్రశేఖర్